Chiranjeevi selfie with Ram Charan Varun Tej Akira Nandan gone viral
Chiranjeevi : మెగా ఫ్యామిలీ అంతా ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ ని బెంగళూరులో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి ఫార్మ్ హౌస్ లో ఈ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ జరగగా.. మెగా వారసులంతా హాజరయ్యి సందడి చేశారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్, శిరీష్.. ఇలా అందరూ ఆ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ వారసులు అకిరా నందన్, ఆద్య కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ కి వచ్చారు.
ఇక అక్కడ తమ సిబ్లింగ్స్ అండ్ కజిన్స్ తో కలిసి ఫెస్టివల్ ని బాగా ఎంజాయ్ చేశారు. ఈ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను ఒక్కొక్కరిగా మెగా ఫ్యామిలీ మెంబెర్స్ అంతా షేర్ చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు కూడా కొన్ని ఫోటోలు షేర్ చేశారు. ఆ పిక్స్ లో ఒక ఫోటో మెగా ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. మెగా బ్రదర్స్ అయిన చిరు, నాగబాబు, పవన్ వారసులు ఆ ఫొటోలో కనిపిస్తున్నారు.
Also read : Chiranjeevi : హనుమాన్ దర్శకుడితో చిరంజీవి సినిమా.. ‘సైరా’ ముందే రావాల్సింది.. కానీ..
అన్నదమ్ములు రామ్ చరణ్, వరుణ్ తేజ్, అకిరా నందన్ వెనకాల కూర్చోగా.. చిరు, నాగబాబు వారితో కలిసి ఓ సెల్ఫీ తీసుకున్నారు. ఇక ఈ పిక్ చూసిన అభిమానులు.. మెగా వారసులతో మెగా సెల్ఫీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఈ పిక్ లో సాయి ధరమ్ తేజ్, శిరీష్, ఆద్య, ఉపాసన కూడా కనిపిస్తున్నారు. ఈ పిక్ తో పాటు మరికొన్ని సెల్ఫీలను కూడా నాగబాబు షేర్ చేశారు.
ఇది ఇలా ఉంటే, ఈ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ లో అకిరా పియానో ప్లే చేసిన ఓ వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది. యానిమల్ సినిమాలోని ‘నాన్న నువ్వు నా ప్రాణం’ అనే ఫాదర్ సెంటిమెంట్ సాంగ్ ని అకిరా ప్లే చేయడంతో పవన్ అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక ఇది చూసిన కొంతమంది పవన్ అభిమానులు.. చాలా బాగా ప్లే చేసాడు అని సంతోష పడుతుంటే, కొంతమంది మాత్రం అకిరా హీరోగా ఎంట్రీ ఇవ్వడా..? అంటూ భయపడుతున్నారు.