Chiranjeevi: నేనొక నటుడ్ని.. అంటూ కవిత్వం చెబుతున్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోని సాంగ్స్ షూటింగ్ కోసం ఫ్రాన్స్‌కు వెళ్లాడు. అక్కడ అందాల భామ శ్రుతి హాసన్‌తో కలిసి రెండు సాంగ్స్‌ను షూట్ చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఇతర సినిమాలకు ప్రమోషన్ చేస్తూ, కొన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ ఇస్తూ వాటిని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా మరో సినిమా కోసం చిరు తన వాయిస్‌ను ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Chiranjeevi Shayari For Rangamarthanda

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోని సాంగ్స్ షూటింగ్ కోసం ఫ్రాన్స్‌కు వెళ్లాడు. అక్కడ అందాల భామ శ్రుతి హాసన్‌తో కలిసి రెండు సాంగ్స్‌ను షూట్ చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఇతర సినిమాలకు ప్రమోషన్ చేస్తూ, కొన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ ఇస్తూ వాటిని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా మరో సినిమా కోసం చిరు తన వాయిస్‌ను ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Rangamarthanda: కృష్ణవంశీ మార్క్‌లో ‘రంగమార్తాండ’ టైటిల్ అనౌన్స్‌మెంట్.. !

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, అనసూయ భరద్వాజ్ వంటి వర్సటైల్ యాక్టర్స్ నటిస్తుండటంతో ఈ మూవీపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా, తాజాగా ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. ఈ సినిమా కోసం ఆయన ఓ కవిత్వాన్ని వినిపించేందుకు రెడీ అయ్యారు.

Rangamarthanda : డ్యాన్స్ మాస్టర్‌గా ప్రకాష్‌రాజ్ భార్య.. కృష్ణవంశీ దర్శకత్వంలో…

‘నేనొక నటుడ్ని..’ అంటూ మెగాస్టార్ చెప్పబోయే ఈ కవితాఝరిని డిసెంబర్ 21న ఉదయం 11.07 గంటలకు విడుదల చేయబోతున్నట్లు రంగమార్తాండ చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండటం విశేషం. మరి చిరు చెప్పబోయే ఈ కవిత ఎలా ఉండబోతుందో చూడాలి.