Rangamarthanda : డ్యాన్స్ మాస్టర్‌గా ప్రకాష్‌రాజ్ భార్య.. కృష్ణవంశీ దర్శకత్వంలో…

కృష్ణవంశీ ప్రస్తుతం 'రంగమార్తాండ' సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో ఒక పాట కూడా చిత్రీకరణ జరుగుతుంది. ఈ పాటలో.......

Rangamarthanda : డ్యాన్స్ మాస్టర్‌గా ప్రకాష్‌రాజ్ భార్య.. కృష్ణవంశీ దర్శకత్వంలో…

Rangamarthanda

Pony Prakashraj :   కృష్ణవంశీ ప్రస్తుతం ‘రంగమార్తాండ’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మరాఠీ క్లాసిక్ సినిమా ‘నటసామ్రాట్’కు రీమేక్ గా ‘రంగమార్తాండ’ తెరకెక్కుతుంది. సినిమాల్లో, ఫిల్మ్ ఇండస్ట్రీలో, నాటక రంగంలో ఉండే బాధల గురించి, వాటి గొప్పతనం గురించి ఇందులో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. మూడు సంవత్సరాల క్రితమే ఈ సినిమా షూట్ మొదలయింది. కాని కరోనా వల్ల సినిమా మరింత ఆలస్యం అవుతుంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మికలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో ఒక పాట కూడా చిత్రీకరణ జరుగుతుంది. ఈ పాటలో సినిమాలో నటిస్తున్న అందరు కీలక నటులు కనిపించనున్నారట. ఈ పాటకు సంబంధించి ఓ పోస్ట్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు కృష్ణ వంశీ. ప్రకాశం రాజ్ భార్య ఫోటోని షేర్ చేస్తూ.. ”రంగమార్తాండ సినిమాలో అందరూ కనిపించే సాంగ్ కి అద్భుతమైన కొరియోగ్రఫీని ప్రకాష్ రాజ్ భార్య పోనీ ప్రకాష్ రాజ్ అందించారు.” అని పోస్ట్ చేశారు.

Puri Jagannadh : నేను బ్యాంకాక్ బీచ్ లో స్క్రిప్ట్ రాయను

పోనీ ప్రకాష్ రాజ్ మొదటి నుంచి మంచి డ్యాన్సర్, కొరియోగ్రాఫర్. ఇప్పటి వరకు చాలా హిందీ సినిమాలకి కొరియోగ్రాఫర్ గా పని చేశారు. ‘రంగమార్తాండ’తో మొదటి సారి తెలుగు సినిమాకి పని చేశారు. కృష్ణవంశీ ప్రకాష్ రాజ్ ని అడగటంతో ప్రకాష్ రాజ్ ఈ సినిమాకి కొరియోగ్రాఫర్ గా ఒప్పించాడని సమాచారం.

Ajay Devagan : శబరిమలలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్

ఈ పాటని చాలా ఫాస్ట్ గా అయిదు గంటల్లోనే షూటింగ్ పూర్తి చేసినట్లు కూడా తెలిపారు. ఇంకొక్క రోజు షూటింగ్ మినహా మొత్తం షూటింగ్ పూర్తయింది అని కూడా పోస్ట్ చేశారు. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ మొదలు పెడతామని, ఈ సంవత్సరమే రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తామని కృష్ణవంశీ తెలిపారు.