K Viswanath : మీ దర్శకత్వంలో నటించడం నా అదృష్టం.. కళాతపస్వికి మెగాస్టార్ జన్మదిన శుభాకాంక్షలు
చిరంజీవి ట్విట్టర్లో కె విశ్వనాథ్ తో దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. ''గురు తుల్యులు, కళాతపస్వి కె.విశ్వనాథ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు జాతి, తెలుగు సినిమా ఖ్యాతిని............
- Saketh U
- Published On : February 19, 2022 / 10:26 AM IST
Chiru
K Viswanath : శంకరాభరణం, సాగర సంగమం, సప్తపది, స్వాతిముత్యం, స్వర్ణకమలం, ఆపద్భాందవుడు… లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు అందించిన కళాతపస్వి కె. విశ్వనాథ్ గారి పుట్టిన రోజు ఇవాళ. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా ఎన్నో మంచి సినిమాలని తెలుగు ప్రేక్షకులకి అందించారు. రాష్ట్ర, జాతీయ అవార్డులు లెక్కలేనన్ని అందుకున్నారు.
ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా సినీ ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కె విశ్వనాథ్ కు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. చిరంజీవి కె విశ్వనాథ్ గారి కాంబినేషన్లో ఆపద్భాంధవుడు, స్వయంకృషి, శుభలేఖ లాంటి అద్భుతమైన సినిమాలు వచ్చాయి.
Rana Daggubati : భళ్లాలదేవ క్రేజ్‌ని ‘బీమ్లా నాయక్’ ఎందుకు వాడట్లేదు??
చిరంజీవి ట్విట్టర్లో కె విశ్వనాథ్ తో దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. ”గురు తుల్యులు, కళాతపస్వి కె.విశ్వనాథ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు జాతి, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసి, తెలుగు సినిమా చరిత్ర శంకరాభరణం ముందు, శంకరాభరణం తర్వాత అనేలా చేసిన మీరు తెలుగు వారందరికి అందిన వరం. మీ చిత్రాలు అజరామరం. మీ దర్శకత్వంలో నటించడం నా అదృష్టం. మీరు కలకాలం ఆయురారోగ్యాలతో సంతోషంగా వుండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.” అంటూ పోస్ట్ చేశారు.
Happy Birthday Legendary Director #KalaTapasvi K.Viswanath garu ! pic.twitter.com/io8FmZhGO7
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 19, 2022
