Chiranjeevi : సినిమాలు ఫ్లాప్ అయినా వరుణ్ ఫెయిల్ అవ్వలేదు.. పెద్ది నుంచి మొదలయి.. నా బర్త్ డేకి మెగా 158 టీజర్..
ఈ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ.. (Chiranjeevi)
- Saketh U
- Published on- August 11, 2026 / 07:51 PM IST
Chiranjeevi
Chiranjeevi : వరుణ్ తేజ్, రితిక నాయక్ జంటగా తెరకెక్కిన కొరియన్ కనకరాజు సినిమా ఇటీవల ఆగస్టు 7న థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం సాధించింది. ఇప్పటికే 30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది ఈ సినిమా. నేడు కొరియన్ కనకరాజు మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించగా మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యారు.
Also Read : NTR : ఎన్టీఆర్ కి శస్త్రచికిత్స.. ఆందోళనలో అభిమానులు..
ఈ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ.. ఈ సినిమా చూశాక ఎప్పుడు ఫంక్షన్ పెడతారు, రావాలి అనుకున్నాను. వరుణ్ వచ్చి డాడీ మీరు రావాలి అనగానే తప్పకుండా వస్తాను అని చెప్పాను. ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్పాలి. వరుణ్ మొదట్నుంచి కూడా సేఫ్ జోన్ కాకుండా రిస్క్ అయినా వెరైటీగా, డిఫరెంట్ పాత్రలతో వస్తున్నాడు. వైవిద్యం చూపిస్తూ కొత్త గెటప్స్ తో వస్తున్నాడు. ఆర్టిస్ట్ గా నిలబడాలి అని చూస్తున్నాడు కానీ గబగబా సినిమాలు చేయాలి, డబ్బులు సంపాదించాలి అని చూసుకోవట్లేదు. వరుణ్ ఆలోచన విధానం, అతను ఎంచుకున్న జోనర్స్ బాగున్నాయి. ఈ క్రమంలో అతను చేసిన అన్ని సినిమాలు హిట్ అవ్వకపోవచ్చు కానీ అతను నటనలో ఎపుడూ ఫెయిల్ అవ్వలేదు. ఇదే ధైర్యంతో ఇలాగే కొత్త కథలతో ముందుకు వెళ్ళు.
ఇది వరుణ్ సక్సెస్ అని చెప్పినా ఇది వరుణ్ తనయుడు వాయువ్ ఖాతాలో వెయ్యాలి. నీ లక్కీ చామ్ వాయువ్. ఈ సినిమా హిట్ అవ్వడానికి సత్య ముఖ్య కారణం. సత్య కోసం ఈ సినిమాను ఇంకోసారి చూసాను. సత్య కామెడీ కోసం మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. నువ్వు నా అభిమాని అని చెప్పావు. నా అభిమాని ఇంత సక్సెస్ అయినందుకు గర్వపడుతున్నాను. ఈ సంవత్సరం సంక్రాంతి తర్వాత సినిమాలు హిట్ అవ్వలేదు. చాలా డ్రై గా ఉంది థియేటర్స్ అనుకున్నప్పుడు పెద్ది నుంచి మొదలయి మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ, ఇప్పుడు కొరియన్ కనకరాజు.. ఇలా వరుసగా హిట్ అవుతున్నాయి. సినిమాలకు ప్రేక్షకులు వచ్చారు, హిట్ అయ్యాయి. చాలా మంది థియేటర్స్ కి జనాలు రారు, ఓటీటీలు కారణం అంటారు కానీ అది కారణం కాదు. కంటెంట్ మనం కరెక్ట్ గా ఇస్తే అవి హిట్ అవుతాయి. ఆగస్టు 22 నా బర్త్ డేకి మెగా 158 టీజర్, టైటిల్ వస్తుంది. టైటిల్ లీక్ చేయాలని ఉంది కానీ ఆపుకుంటున్నాను అని అన్నారు. అలాగే మూవీకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతూ అభినందనలు తెలిపారు.
Also See : చిరంజీవి గెస్ట్‌గా ‘కొరియన్ కనకరాజు’ మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్.. లైవ్ ఇక్కడ చూసేయండి..
