NTR : ఎన్టీఆర్ కి శస్త్రచికిత్స.. ఆందోళనలో అభిమానులు..
ఎన్టీఆర్ కి ఇప్పుడు శస్త్రచికిత్స చేయబోతున్నట్టు ఎన్టీఆర్ టీం ఓ ప్రకటన విడుదల చేసింది. (NTR)
ntr
NTR : ఇటీవల డ్రాగన్ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ భుజానికి దురదృష్టవశాత్తు గాయమైందని, చికిత్స తీసుకుంటున్నారని, ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుండి ఎనిమిది వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పినట్టు ఎన్టీఆర్ టీమ్ ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకున్నారు.
అయితే ఎన్టీఆర్ కి ఇప్పుడు శస్త్రచికిత్స చేయబోతున్నట్టు ఎన్టీఆర్ టీం ఓ ప్రకటన విడుదల చేసింది.
Also See : చిరంజీవి గెస్ట్‌గా ‘కొరియన్ కనకరాజు’ మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్.. లైవ్ ఇక్కడ చూసేయండి..
ఎన్టీఆర్ టీం చేసిన ప్రకటనలో.. భుజానికి గాయం అయిన తర్వాత వైద్యుల సలహా మేరకు NTR గారు కిమ్స్ హాస్పిటల్స్ హైదరాబాద్ లో రేపు భుజానికి శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. వైద్యుల బృందం NTR గారు త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకునే దిశగా వైద్యం అందిస్తోంది. శస్త్రచికిత్స తర్వాత ఆయన ఆరోగ్య పురోగతికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాము అని తెలిపారు.
దీంతో గాయం అయినప్పుడు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని ప్రకటించి, ఇప్పుడు శస్త్రచికిత్స చేస్తున్నారు అని ప్రకటించడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. త్వరగా ఎన్టీఆర్ కోలుకొని మళ్ళీ డ్రాగన్ షూటింగ్ లోకి రావాలని ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు.

