Vishwambhara: రెండు పార్ట్స్ గా మెగాస్టార్ ‘విశ్వంభర’.. ఒకే ఒక పోస్ట్ తో కన్ఫర్మ్ చేసిన డైరెక్టర్

విశ్వంభర(Vishwambhara) సినిమా రెండు పార్టులుగా రానుందా? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు వశిష్ట.

Chiranjeevi Vishwambhara Movie to Be Released as Two Parts

  • రెండు భాగాల వార్తలను ఖండించిన వశిష్ఠ

  • ఒకే భాగంగా రానున్న మెగాస్టార్ విశ్వంభర

  • 14 లోకాల ఫాంటసీ మూవీ విశ్వంభర

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర(Vishwambhara)’. భారీ గ్రాఫిక్స్ తో విజువల్ వండర్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, రిలీజ్ వాయినా పడుతూనే వస్తోంది. కానీ, అంచనాలు మాత్రం తగ్గడం లేదు. త్వరలోనే ఈ సినిమా విడుదలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, తాజాగా విశ్వంభర సినిమాపై కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అయితే, ఆ రూమర్స్ కి తాజాగా తెరపడింది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది.

Peddi trailer: మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘పెద్ది’ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అయితే, ఈ వార్తలపై దర్శకుడు వశిష్ఠ స్పందిస్తూ ‘అవునా.. నిజమా’ అని నవ్వుతున్న ఎమోజీలను జత చేసి పోస్ట్ చేశారు. తద్వారా ఈ సినిమా కేవలం ఒకే భాగంగా రాబోతోందని ఆయన పరోక్షంగా స్పష్టం చేస్తూ రూమర్లను ఖండించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే ప్రముఖ నటి మౌనీరాయ్ ఒక ప్రత్యేక గీతంలో చిరంజీవితో కలిసి సందడి చేయనుంది. ఈ సినిమా కథ 14 లోకాల చుట్టూ తిరుగుతుందని, ఫాంటసీ అంశాలతో కూడిన అద్భుత దృశ్యకావ్యంగా నిలుస్తుందని సమాచారం.

చిరంజీవి గతంలో ఎన్నడూ చేయని సరికొత్త పాత్రలో కనిపించబోతుండటం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. మరీ, ముఖ్యంగా ఈ సినిమా కోసం ప్రపంచస్థాయి వీఎఫ్‌ఎక్స్‌ (VFX) కంపెనీలు పనిచేస్తున్నట్లు దర్శకుడు గతంలోనే వెల్లడించారు. వాస్తవ ప్రపంచాన్ని తలపించేలా భారీ సెట్లు వేసి, గ్రాఫిక్స్ సాయంతో వెండితెరపై ఒక వింత లోకాన్ని ఆవిష్కరించబోతున్నారు. హీరో ఇతర లోకాలకు ఎలా వెళ్తాడు, హీరోయిన్‌ను ఎలా తిరిగి తీసుకువస్తాడు అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రం సాగుతుంది. దీంతో, ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. మరి విడుదల తరువాత ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది చూడాలి.