Peddi trailer: మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘పెద్ది’ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది
రామ్ చరణ్ పెద్ది ట్రైలర్(Peddi trailer) రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించిన మేకర్స్.
mega power star ram charan peddi movie trailer releasing on may 18th
Peddi trailer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సంచలన దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా చిత్ర యూనిట్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా ట్రైలర్ను మే 18వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా “పెద్ది గాడి ప్రయాణం చాలా ప్రత్యేకం” అంటూ విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Ravi teja: రెమ్యునరేషన్ పూర్తిగా తగ్గించిన రవితేజ.. వామ్మో.. మరీ ఇంత తక్కువా?
రామ్ చరణ్(Peddi trailer) కెరీర్లో ఇది ఒక విభిన్నమైన ప్రాజెక్ట్ అని, గ్రామీణ నేపథ్యంలో సాగే భావోద్వేగపూరిత ప్రయాణమని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం రామ్ చరణ్ మేకోవర్ మరియు బుచ్చిబాబు మేకింగ్ స్టైల్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ అప్డేట్ రావడంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. మే 18న రానున్న ట్రైలర్ ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక భారీ అంచనాల మధ్య పెద్ది సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
