Chiranjeevi : 50 ఏళ్ళ ప్రయాణం పూర్తి చేసుకున్న సినీ ప్రముఖుడు.. చిరు ఎమోషనల్ పోస్ట్..

మెగాస్టార్ చిరంజీవి ఈరోజు తన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ వేశాడు. 50 ఏళ్ళ ప్రయాణం పూర్తి చేసుకున్న ఆ సినీ ప్రముఖుడికి..

Chiranjeevi wishes to Writer Satyanand for completing 50 years

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఈరోజు తన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ వేశాడు. “ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలకి స్క్రిప్ట్ సమకూర్చి, పదునైన డైలాగ్స్ రాసి, నేటి రచయితలకు, దర్శకులకు, నటులకు ఒక మెంటోర్ గా, ఒక గొప్ప సపోర్ట్ సిస్టమ్ గా ఉండే నా అత్యంత ఆప్తులు, మృదు భాషి , అత్యంత సౌమ్యులు,
సత్యానంద్ గారు తన సినీ ప్రస్థానం లో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు నా హృదయ పూర్వక ఆత్మీయ శుభాకాంక్షలు” అంటూ చిరంజీవి రాసుకొచ్చాడు.

సత్యానంద్ టాలీవుడ్ లో ఒక సీనియర్ రైటర్ ఎన్టీఆర్, ఎన్నార్, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తదితరుల సినిమాలకు రచయితగా పని చేశారు. రచయితగా 400కు పైగా సినిమాలకు పని చేశారు. డైరెక్టర్ గా స్వాతంత్ర్య సమరయోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి కథని ‘ఝాన్సీ రాణి’గా సినిమాగా తెరకెక్కించారు. కానీ దర్శకులుగా సక్సెస్ కాలేకపోయారు. కొండవీటి సింహం, యముడికి మొగుడు, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, అంజి, టక్కరి దొంగ.. వంటి సినిమాలకు కథని అందించారు.

Also Read : Singer Mangli : బావతో మంగ్లీ పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సింగర్.. మా బావతో పెళ్లి..!

ఇక మరెన్నో సినిమాలకు అద్భుతమైన స్క్రీన్ ప్లే, పదునైన మాటలు రాశారు. ఇటీవల కాలంలో వచ్చిన నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయనా’, రవిబాబు ‘ఆవిరి’ సినిమాలకు కూడా స్క్రీన్ ప్లే అందించారు. ముఖ్యంగా చిరంజీవి సినీ ప్రయాణంలో ఈయన కూడా ఒక ప్రధాన పాత్ర పోషించారు అని చెప్పొచ్చు. దీంతో చిరంజీవి, సత్యానంద్ మధ్య ఆత్మీయత ఉంది. ఈక్రమంలోనే సత్యానంద్ 50 ఏళ్ళ ప్రయాణానికి శుభాకాంక్షలు తెలుపుతూ.. “మరో అర్ధ శతాబ్దం పాటు ఇంతే ఎనర్జీతో ఉండాలని ఆశిస్తున్నాను” అంటూ చిరంజీవి పేర్కొన్నాడు.