Chiranjeevi : ‘రీ రిలీజ్’లపై 1989లోనే ఫ్యాన్స్ కి లెటర్ రాసిన మెగాస్టార్.. అప్పట్లో సంవత్సరానికి ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా..

ఓ 36 ఏళ్ళ క్రితమే చిరంజీవి రీ రిలీజ్ ల గురించి ఫ్యాన్స్ కి రాసిన ఓ లెటర్ వైరల్ గా మారింది. (Chiranjeevi)

  • Published on- August 18, 2026 / 08:28 PM IST

Chiranjeevi

Chiranjeevi : ఇటీవల గత కొన్నాళ్ళుగా రీ రిలీజ్ ట్రెండ్ వచ్చి హిట్, ఫ్లాప్ సంబంధం లేకుండా అన్ని పాత సినిమాలు వరుసపెట్టి ప్రతి శుక్రవారం రిలీజ్ అవుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు, పాటలు బాగున్నా సినిమాలకు ఫ్యాన్స్ భారీగానే వస్తున్నారు. అయితే గతంలో కూడా ఈ రీ రిలీజ్ లు నడిచాయి. తాజాగా ఓ 36 ఏళ్ళ క్రితమే చిరంజీవి రీ రిలీజ్ ల గురించి ఫ్యాన్స్ కి రాసిన ఓ లెటర్ వైరల్ గా మారింది.

ఇప్పుడంటే స్టార్ హీరోలు రెండు మూడేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు కానీ అప్పట్లో హీరోలు సంవత్సరానికి బోలెడన్ని సినిమాలు చేసేవాళ్ళు. అన్ని సినిమాలు చేసినా ఫ్యాన్స్ ఇంకా సినిమాలు కావాలి అనేవాళ్ళు. అలా చిరంజీవి ఫ్యాన్స్ సినిమాలు కావాలని చిరంజీవికి లెటర్ రాయడం, కొత్త సినిమాలు లేక పాత సినిమాలు మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు అని లెటర్స్ రాయడంతో చిరు ఓ పత్రికా ప్రకటన ఇచ్చారు.

Also Read : Raviteja Son : ఇప్పుడు సూర్య సినిమాకు, నెక్స్ట్ ప్రభాస్ సినిమాకు.. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రవితేజ కొడుకు..

చిరంజీవి అభిమానులకు ఇచ్చిన ప్రకటనలో.. డియర్ ఫ్యాన్స్. ఈ సంవత్సరంలో నా సినిమాలు నాలుగో అయిదో రిలీజ్ వుండటం ఏమిటనీ, అంత తక్కువ సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతుంటే నిస్పృహగా ఉంటుందని అనేకమంది అభిమానులు తమ ఆందోళన వ్యక్తపరుస్తూ ఉత్తరాలు వ్రాశారు. రుద్రనేత్ర, కొండవీటిదొంగ, లంకేశ్వరుడు.. లాంటి సినిమాలు మిగతా మాదిరిగా తక్కువరోజుల్లో పూర్తయ్యే సినిమాలు కాదు. 1988లో పని చేసింది గాక రుద్రనేత్రకు ఈ సంవత్సరంలో కూడా 44 రోజులు పని చేస్తేగాని పూర్తికాలేదు. మీరు తెరపై రెండుమూడు నిముషాలపాటు చూసే సన్నివేశం చిత్రీకరణలో ఒక్కోసారి 3,4 రోజులు మాటింగ్ చేయవలసి వుంటుంది. అలాంటి సన్నివేశాలు లంకేశ్వరుడులో, కొండవీటిదొంగలో అనేకం వున్నాయి.

ఈ సంవత్సరంలో నేను వరుసగా విదేశాలకు వెళ్లవలసి వచ్చిన సంగతి మీకు తెలుసు. అంతేగాక ఇండస్ట్రీలో యీ మధ్య ఏర్పడ్డ సంక్షోభం కూడా మన సినిమాలు ఆలస్యం కావడానికి కారణం అయింది. నా సినిమాలు తగినన్ని మార్కెట్లో లేనందున సెకండ్ రన్ సినిమాలు, థర్డ్ రన్ సినిమాలు, అందులో ఒకప్పుడు ఫ్లాప్ అయిన సినిమాలు సైతం మార్కెట్లో వీరవిహారం చేస్తున్నాయనీ, న్యూట్రెండ్ కి భిన్నమైన సినిమాలు మార్కెట్లో మూవ్ కానివ్వటం వల్ల నా ఇమేజ్ పాడవుతుందంటూ కొందరు అనూహ్యమైన భయానికి లోనవుతూ ఉత్తరాలు వ్రాశారు. వారి అభిమానానికి నా కృతజ్ఞతలు. నా సినిమాలు సెకండ్, థర్డ్ రన్ వల్ల నా ఇమేజ్ పెరుగుతుందే తప్ప, దెబ్బతినదని నా అభిప్రాయం.

కొన్ని సినిమాలు అప్పట్లో బాగా ఆడకపోయి వుండవచ్చు. ఇవ్వాళ అవి దుమ్ముదులపటం చూస్తున్నాం. రిలీజ్ అయినప్పుడు ఒక సినిమాను ప్రేక్షకులు చూసే దృక్పథం వేరు. అదే కొన్నేళ్ల తర్వాత తిరిగి చూడాల్సి వచ్చినప్పుడు చూసే దృక్పధం వేరు. 16వ ఏట మీరు దిగిన ఫొటో మీ 26వ ఏట చూసుకున్నప్పుడు మీకు అసహ్యమనిపించదు. అప్పుడు ఎలా వుండేవాడిని? అని ఆశ్చర్యంగా, ఆనందంగా మురిసిపోతూ చూసుకుంటారు. ఇవాల్టి పర్సనాలిటీ ముందు ఆ పర్సనాలిటీ ఛీ!పాడు అని అనిపిస్తుందా? అప్పుడు బాగా ఆడని సినిమాలు ఇప్పుడు బాగా ఆడటంలో అనేక కారణాలు కొత్తగా ఇప్పుడు కనిపిస్తూ వుంటాయి. ఆ సినిమాలు నా ఇమేజ్ ని పాడుచేస్తాయని ఏ అభిమాని భయపడవలసిన అవసరంలేదని మనవి చేస్తున్నాను. ఈ రకంగా ప్రతినెలా పత్రికా ముఖంగా పాఠకులతో, అభిమాన ప్రేక్షకులతో ముచ్చటించవలసిందిగా పత్రికాధిపతులు కోరారు. ఆ మేర ఈ నెల మీతో మాట్లాడటం నాకు ఎంతో ఆనందంగా వుంది. మళ్లీ వచ్చేనెల కలుద్దాం అంటూ పేర్కొన్నారు.

Also See : NTR : ఎన్టీఆర్ కి అప్పటివరకు రాజకీయాల్లోకి రావొద్దని చెప్పాను.. వేణుస్వామి కామెంట్స్ వైరల్..

దీంతో అప్పట్లోనే చిరంజీవి సినిమాలు రీ రిలీజ్ లు అయ్యేవని, అప్పుడు రీ రిలీజ్ లకు ఫ్యాన్స్ భయపడ్డారని, దానికి మెగాస్టార్ సరైన సమాధానం ఇచ్చారని తెలుస్తుంది. ఈ పాత ప్రకటన బయటపడటంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిరు చెప్పిన మాటలు కూడా నిజమే అని ఇటీవల రీ రిలీజ్ లు చెప్పకనే చెప్తున్నాయి.