Ram Charan : చరణ్‌కి సెలబ్రిటీస్ బర్త్ డే విషెస్.. బన్నీ, చరణ్ ‘నాటు నాటు’ వీడియో..
చరణ్ కి బర్త్ డే విషెష్ తెలియజేస్తూ.. సెలబ్రిటీస్, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్వీట్స్ వేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్..
- gum 95921
- Updated on- March 27, 2024 / 02:13 PM IST
Cinema Celebrities birthday wishes to Ram Charan
Ram Charan : నేడు తన పుట్టినరోజు కావడంతో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన అత్తమామలు, భార్య ఉపాసన, కూతురు క్లీంకారతో కలిసి రామ్ చరణ్.. శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని వెంకన్న అశీసులు తీసుకున్నారు. ఇది ఇలా ఉంటే, చరణ్ కి బర్త్ డే విషెష్ తెలియజేస్తూ.. సెలబ్రిటీస్, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్వీట్స్ వేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ తో సహా పలువురు ట్వీట్స్ వేశారు.
Also read : Ram Charan : రామ్ చరణ్ కూతురి ఫేస్ రివీల్ అయ్యిపోయింది.. ఎంత క్యూట్‌గా ఉంది..
రామ్ చరణ్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలంటూ పవన్ ట్వీట్ చేసారు. ఎంత ఎదిగిన ఒదిగి ఉంటాడని, పెద్ద వారి పట్ల, సాంప్రదాయ పద్ధతులు పట్ల చాలా గౌరవంగా వ్యవహరిస్తాడని, ప్రతి విషయంలోనూ విద్యార్థిలా నడుచుకుంటాడని, ఏవ్ తనకి శ్రీరామ రక్ష అని చెప్పుకొచ్చారు.
ఇక ఎన్టీఆర్.. హ్యాపీ బర్త్ డే మై బ్రదర్ రామ్ చరణ్ అంటూ ట్వీట్ చేసారు. చరణ్ కి మరింత సంతోషం, సక్సెస్ చేకూరాలని కోరుకుంటున్నట్లు ఎన్టీఆర్ పేర్కొన్నారు.
అల్లు అర్జున్ విషయానికి వస్తే.. తన ఇన్స్టాగ్రామ్ లో ఓ స్పెషల్ వీడియో పోస్ట్ కూడా వేశారు. ఆ వీడియోలో అల్లు అర్జున్, శిరీష్, నిహారిక, చరణ్ కలిసి నాటు నాటు స్టెప్ వేస్తున్నారు.
