ప్రముఖ సినిమా డైరెక్టర్ మారుతీ 10 టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. తన బాల్యం, సినీ జీవిత విశేషాలను వివరించారు. సినిమాలను ఆడియన్స్ రిసీవ్ చేసుకుని యాక్సెప్ట్ చేస్తుందన్నందుకే డబ్బులు వస్తున్నాయి. లేకపోతే రావన్నారు.
ప్రముఖ సినిమా డైరెక్టర్ మారుతీ 10 టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. తన బాల్యం, సినీ జీవిత విశేషాలను వివరించారు. ఆయన తెలిసి మరిన్ని వివరాలను మారుతి మాటల్లోనే చూద్దాం….
యాంకర్ స్వప్న : మిమ్మల్నీ కంప్లీట్ గా అందరూ రిసీవ్ చేసుకుని యాక్సెప్ట్ చేస్తున్నారా? అప్ కమింగ్ అని చూస్తారా?
డైరెక్టర్ మారుతి : ఆడియన్స్ రిసీవ్ చేసుకుని యాక్సెప్ట్ చేస్తుందన్నందుకే డబ్బులు వస్తున్నాయి. లేకపోతే రావు. ఆడియన్స్ యాక్సెప్ట్ చేయకపోతే ముందు వీడిని థియేటర్ లో నుంచి తీసివేయాలంటారు. అస్సలు థియేటర్ ముఖం చూడరు. ఒక్క టిక్కెట్ తీసుకోరు. వాళ్ల టైమ్ రెండు గంటలన్నర సమయం మనం కోసం ఇవ్వరు. ఎందుకంటే డబ్బులన్నా ఇస్తారు కానీ టైమ్ మాత్రం ఇవ్వరు. ఆడియన్స్ టైమ్ చాలా విలువైనది.
యాంకర్ స్వప్న : మీ జీవితం పట్ల ఏ విధంగా క్లారిటీ వచ్చింది?
డైరెక్టర్ మారుతి : మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ..రోడ్డుపై ఉండి అన్నీ, అందరినీ చూసిన వాణ్ణి. మా నాన్న అరిటిపల్లు అమ్మేవాడు. మా నాన్న భోజనానికి వెళ్లినప్పుడు నేను అరిటిపళ్లు అమ్మేవాన్ని. నెంబర్ ప్లేట్లు వేశాను. ఆఫీస్ బాయ్ గా చేశాను. ఎక్కడ పెయిన్ ఉంటుందో నాకు తెలుసు. అందువల్ల మనుషుల మనస్తత్వాలు ఎక్కువగా చదివాను. అరిటిపళ్లు అమ్ముతూ థియేటర్లపై ఉండే సినిమా పోస్టర్లను చూసి బొమ్మలు వేసే వాన్ని, అక్కడ నాకు ఆర్ట్ పుట్టింది. ఆ తర్వాత నెంబర్ ప్లేట్లు వేస్తూ మనీ కింద కన్వర్ట్ చేసుకున్నాను. అప్పుడు ఎంజాయ్ చేస్తూ పని చేశాను. కష్టాన్ని ఫీలవ్వకూడదు..ఎంజాయ్ చేయాలి. నేను ఆ విధంగా వచ్చినందుకు గర్వపడుతున్నాను. నా సినిమాకు అవన్ని ఉపయోగపడ్డాయి. మాస్ ఆడియన్స్ కు క్లాస్ థాట్ రీచ్ అవుతుంది. నేను మాస్ లో నుంచి వచ్చాను కాబట్టే ఒక క్లాస్ గా ప్రజెంట్ చేయలగల్గుతున్నా..మాస్ థాట్ రీచ్ అవుతుంది. మనలో చిన్నపిల్లల తత్వం పోయి ముదిరిపోతే మనం పనికి రాము.
నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు నాన్న నిర్వహించే అరటిపళ్ల బండి దగ్గర ఉండేవాన్ని. 10వ తరగతి నుంచి మా మావయ్య గారి ఆఫీస్ లో వర్క్ నేర్చుకోవడానికి వెళ్లి పోయాను. ఇంటర్ నుంచి డిగ్రీ నెంబర్ ప్లేట్లు వేశాను. కాలేజీ టైమ్ అయిపోయాక మెకానిక్ షాపులో నెంబర్ ప్లేట్లు వేశాను..రూ.25 రూపాయలు ఇచ్చే వారు. నెల ఖర్చులు తీరేవి. లైఫ్ ను ఎంజాయ్ చేసేవాడిని.
యాంకర్ స్వప్న : సత్యరాజుగారి కాస్టింగ్ ఎలా తట్టింది. ఆయన్ను పెట్టుకోవాలని ఎందుకనిపించింది?
డైరెక్టర్ మారుతి : తాత క్యారెర్టర్ కు సత్యరాజు గారు అని అనుకున్నాను. ఆయనను అనుకునే రాశాను. అనుకున్న తర్వాత రావు రమేష్ గారికి చెప్పాను. సత్యరాజు గారు చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఆయన, నేను కలిసి వర్క్ చేశాం..మా ఫాదర్ కు సెట్ అవుతారా అని రావు రమేష్ అన్నారు. మీకు కాన్ఫిడెంట్ ఉంటే వెళ్లండి అన్నారు. ఆ తర్వాత అరవింద్ గారికి చెప్పాను. సత్యరాజు గారు ఓకే అని బలంగా చెప్పాను. సత్యారాజు గారు ఓకే చేయకపోతే నా కథకు ఆల్టర్ నేటివ్ ఎవరనేది థింక్ చేయలేకపోతున్నాను అంకుల్ అని చెప్పాను. సత్యరాజు కథ విని చాలా ఎక్సైట్ అయి నేను ఈ సినిమా తీస్తానని చెప్పారు. అప్పుడే నా సినిమా సక్సెస్ అయిపోయినట్లు ఫీలయ్యాను. ఆయన ఒప్పుకుంటే సినిమా హిట్ అని నమ్మాను… అదే జరిగింది.
యాంకర్ స్వప్న : మంచి సెటిల్ జాబ్ నుంచి బయటికి వస్తే అవాంతరాలు వస్తాయనే ఆలోచన రాలేదా?
డైరెక్టర్ మారుతి : మీరు పని చేయడం మానేసిన రోజు మీరు అయిపోతారంతే. మీరు కష్టపడుతూనే ఉండండి…సక్సెస్ అదే వంగుతుంది. నేను కష్టాన్ని నమ్ముతాను. అందుకని పొద్దునే లేచి తొమ్మిందిటికి ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాను. ఆదివారాలు కూడా ఇంట్లో కూర్చుని సరదాగా టీవీ చూస్తూ గడపటం నేను చేయలేను. సండే కూడా నేను బయటికి వస్తాను. ఆఫీస్ లో కూర్చుంటాను. నేను పని మీద ఉంటాను. నేను పని చేయడం ఆపను. ఏ పని అయినా చేస్తాను.. నెలకు ఇంత సంపాందించాలి. ఆ మాత్రం సంపాదించే తెలివి తేటలు ఉన్నాయి. కచ్చితంగా దేవుడు స్కిల్ ఇచ్చాడు. ఏవి రాకపోకయినా బొమ్మలేస్తూ బ్రతికేస్తాను. ఏదైనా చేయగల్గుతాను. ఆర్ట్ ఎగ్జిబిషన్ పెడతాను. బోలెడన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఎవరిపైనా ఆధారాపడాల్సిన అక్కర్లేదు. నా మీద నాకు కాన్ఫిడెంట్ ఉంది. లీస్ట్ అనేది ఆలోచన చేస్తా..దాంతోనే బయటికి వచ్చాను. కొన్నాళ్లు కష్టపడ్డాం.. మంచి టీమ్ ఫామ్ అయ్యాం. లైఫ్ లో రిస్క్ టైమ్ వచ్చినప్పుడు చేయాలి. 40, 45 సంవత్సరాలు వచ్చేటప్పటికీ రిస్క్ చేసే పరిస్థితిలో మీరు ఉండరు. అరవింద్ గారు లివింగ్ ఎగ్జామ్ పుల్. రిస్క్ చేయాల్సిన ఏజ్ వస్తే రిస్క్ చేసేయాలి. నీలో ఈ టాలెంట్ ఉందని చుట్టుపక్కల ఉన్న పదిమందైనా గుర్తించాలి.
యాంకర్ స్వప్న: సినిమా ఇండస్ట్రీలో నెగ్గాలంటే సపోర్టు ఉండాలా?
డైరెక్టర్ మారుతి : సినిమా ఇండస్ట్రీలో ఒకరి డామినేషన్ అనేది అసలు ఉండదు. నా అంతట నేను నిలబడితే.. అప్పుడు వారందరూ నాకు సోపోర్టు చేస్తారు. నేను ప్రూవ్ చేసుకున్నాక మనం సినిమా చేద్దామని అరవింద్ అన్నారు. మొహమాటం అడ్డుపెట్టి వారి డబ్బులతో గేమ్ ఆడకూడదు. ఎందుకంటే లైఫ్ లాంగ్ ఉండే రిలేషన్ షిప్స్ పోతాయి. బన్ని 20 సంవత్సరాల నుంచి ఫ్రెండ్. 2000 సంవ్సతరం నుంచి పరిచయం. సరదాగా మాట్లాడుకుంటాం.. డిస్కస్ చేసుకుంటాం… బన్నీ మంచి సినిమా చేయాలంటాడు. కానీ బన్నీతో చేసానంటే ది బెస్ట్ చేయాలి…లేకపోతే మా మధ్య ఫ్రెండ్ షిప్ పోతుందన్న భయం. ప్రొఫెషనల్ రిలేషన్ షిప్ కంటే బన్నీని ఫ్రెండ్ గానే చూస్తాను. నా ఫ్రెండ్ షిప్ ను పెట్టి రిస్క్ చేస్తాను.
యాంకర్ స్వప్న : అమ్మాయిల బొమ్మలు ఎప్పుడైన వేశారా?
డైరెక్టర్ మారుతి : అమ్మాయిల బొమ్మలు వేయగల్గితే వాడు మంచి ఆర్టిస్టు. నేను అమ్మాయిల బొమ్మలు బాగా వేస్తాను. నా వైఫ్ కి బొమ్మ వేసి గ్రీటింగ్ కార్డు ఇచ్చాను. వాటిని దాచుకుంది. మళ్లీ నాపై కోపం వచ్చినప్పుడు చింపేసింది. అప్పుడు ఎందుకు చింపానని ఇప్పుడు అనుకుంటుంది.
యాంకర్ స్వప్న : మీరు వర్కింగ్ చేసిన హీరోలందరిలో మీ క్యారెక్టర్ ను స్వంతం చేసుని దించేసిన వ్యక్తి ఎవరు?
డైరెక్టర్ మారుతి : ప్రతిరోజూ పండగే సినిమాలో రావు రమేష్ క్యారెక్టర్ లో నేను కనిపిస్తాను. నేను ఎలా అనుకుంటానో అలా ఉంటది. నాని గారు నా క్యారెక్టర్ ను ఆయన స్టైల్ లోకి తీసుకెళ్లి ఇంకా ఎన్ హాన్స్ చేశాడు. మహానుభావుడులో శర్వానంద్ తనే కనబడతాడు. నేను చెప్పేదానికంటే ఇంకా బాగా చేసిన హీరోలు కూడా ఉన్నారు…అని వివరించారు.