Dancer Nainika : అది మా డ్యాన్సర్స్ ఇష్టం.. వాళ్ళే చూడట్లేదు అంటూ ఆడియన్స్ పైనే విమర్శలు చేస్తున్న డ్యాన్సర్..

నైనిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఢీ షోపై వచ్చే ట్రోల్స్ గురించి ప్రశ్నించగా ..(Dancer Nainika)

Dancer Nainika : అది మా డ్యాన్సర్స్ ఇష్టం.. వాళ్ళే చూడట్లేదు అంటూ ఆడియన్స్ పైనే విమర్శలు చేస్తున్న డ్యాన్సర్..

Dancer Nainika

Updated On : September 15, 2025 / 4:09 PM IST

Dancer Nainika : నైనిక డ్యాన్స్ షో ఢీతో ఫేమ్ తెచ్చుకుంది. అనంతరం సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించి బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక టీవీ షోలు, ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ డ్యాన్స్ మాస్టర్ గా, ఆర్టిస్ట్ గా ట్రై చేస్తుంది నైనిక. (Nainika)

తాజాగా నైనిక ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. అయితే ఇటీవల ఢీ షోలో కంటెస్టెంట్స్ డ్యాన్స్ కంటే కూడా ఎక్కువగా సర్కస్ ఫీట్స్ చేస్తున్నారని, అసలు పాటకు సంబంధం లేకుండా గంతులేస్తున్నారని, డ్యాన్స్ చేయమంటే జిమ్నాస్టిక్స్ చేస్తున్నారని ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఢీ షోపై, ఢీ షోలో వచ్చే డ్యాన్స్ ల గురించి ట్రోల్స్, విమర్శలు వస్తున్నాయి.

Also Read : Mouli Tanuj Prasanth : ‘లిటిల్ హార్ట్స్’ హీరో మౌళి లవ్ స్టోరీ తెలుసా? రియల్ లైఫ్ లో కూడా సీనియర్ నే..

నైనిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ట్రోల్స్ గురించి ప్రశ్నించారు. దీనికి నైనిక సమాధానమిస్తూ.. మేము డ్యాన్స్ చేస్తున్నాం కానీ ఆడియన్స్ చూడట్లేదు. క్లాసికల్ డ్యాన్స్ చేస్తే చూస్తారా? ఇప్పుడంతా ఫేమ్ మీదే నడుస్తుంది ఇండస్ట్రీ. జిమ్నాస్టిక్స్, ఎగరడాలు చేస్తే ట్రోల్ చేస్తారు, తిడతారు కానీ చూస్తారు. అప్పుడు ఫేమ్ వస్తుంది. అందుకే అందరూ అదే చేస్తున్నారు. మేము డ్యాన్స్ చేసినా ఆడియన్స్ చూడట్లేదు. కావాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడండి డ్యాన్స్ ఉంటుంది. ఒక డ్యాన్సర్ గా వాళ్ళిష్టం, వాళ్లకు నచ్చింది చేస్తారు. ఒక ఆడియన్ గా మీకు ఏది కావాలి, ఏది చూడాలి అనుకుంటున్నారో అది మీ ఇష్టం అయితే డ్యాన్సర్స్ వాళ్లకు ఏం నచ్చుతుందో అది చేస్తున్నారు అని తెలిపింది. దీంతో నైనిక కామెంట్స్ వైరల్ గా మారాయి.

Also Read : Naresh Vasuki : మొన్నేమో తండ్రీకూతుళ్లుగా.. ఇప్పుడేమో భార్యాభర్తలుగా.. ఎలా మెప్పిస్తారో ఈ కాంబో..?