Mouli Tanuj Prasanth : ‘లిటిల్ హార్ట్స్’ హీరో మౌళి లవ్ స్టోరీ తెలుసా? రియల్ లైఫ్ లో కూడా సీనియర్ నే..
తాజాగా లిటిల్ హార్ట్స్ ఫేమ్ మౌళి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన రియల్ లైఫ్ లవ్ స్టోరీ గురించి చెప్పమన్నారు.(Mouli Tanuj Prasanth)

Mouli Tanuj Prasanth
Mouli Tanuj Prasanth : ఇటీవల లిటిల్ హార్ట్స్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే స్టార్ డమ్ తెచ్చుకున్నాడు మౌళి తనూజ్ ప్రశాంత్. అయితే మౌళికి ముందు నుంచి సోషల్ మీడియాలో ఫేమ్ ఉంది. సోషల్ మీడియా రీల్స్, యూట్యూబ్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న మౌళి 90s సిరీస్ తో అందర్నీ మెప్పించాడు. ఇప్పుడు హీరోగా మారి లిటిల్ హార్ట్స్ సినిమాతో వచ్చి పెద్ద హిట్ కొట్టి ఒక్కసారిగా టాలీవుడ్ సెన్సేషన్ అయ్యాడు.(Mouli Tanuj Prasanth)
గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా లిటిల్ హార్ట్స్ గురించే వినిపిస్తుంది. తాజాగా మౌళి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన రియల్ లైఫ్ లవ్ స్టోరీ గురించి చెప్పమన్నారు.
Also Read : Naresh Vasuki : మొన్నేమో తండ్రీకూతుళ్లుగా.. ఇప్పుడేమో భార్యాభర్తలుగా.. ఎలా మెప్పిస్తారో ఈ కాంబో..?
దీంతో మౌళి మాట్లాడుతూ.. లవ్ లాంటిది కాదు కానీ క్రష్ ఫీలింగ్ ఉంది. ఇంజనీరింగ్ లో మా సీనియర్ ఒక అమ్మాయి ఉంది. డ్యాన్స్ క్లబ్ లో ఆమె డ్యాన్స్ చేసేది. దూరం నుంచి ఆమె డ్యాన్స్ ని చూసేవాడిని రాజా సినిమాలో వెంకటేష్ లాగా. ఆమెని అలా చూస్తూ ఉండేవాడిని అంతే. తర్వాత కాంటాక్ట్ లేదు. 90s సిరీస్ రిలీజ్ తర్వాత తనే ఇన్‌స్టాగ్రామ్ లో మెసేజ్ చేసింది. ఇప్పుడు ఏం కాంటాక్ట్ లేదు అని తెలిపాడు.
లిటిల్ హార్ట్స్ సినిమాలో హీరో తన కంటే మూడేళ్లు పెద్దయిన అమ్మాయిని లవ్ చేస్తాడు. రియల్ లైఫ్ లో కూడా సీనియర్ మీద క్రష్ అని చెప్పడంతో ఈ వ్యాఖ్యలను సరదాగా వైరల్ చేస్తున్నారు.
Also Read : Manchu Manoj : ‘మిరాయ్’ సినిమాకు మంచు మనోజ్ రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లు తెలుసా? తేజ సజ్జ కంటే ఎక్కువ?