Naresh Vasuki : మొన్నేమో తండ్రీకూతుళ్లుగా.. ఇప్పుడేమో భార్యాభర్తలుగా.. ఎలా మెప్పిస్తారో ఈ కాంబో..?
సీనియర్ నటుడు నరేష్, నటి వాసుకి రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ డిఫరెంట్ కాంబోతో కనిపిస్తున్నారు. (Naresh Vasuki)

Naresh Vasuki
Naresh Vasuki : సినీ పరిశ్రమలో ఆర్టిస్టులు ఏ పాత్ర అయినా వేస్తారు. ఒకరితో ఒక పాత్రలో నటించిన తర్వాత దానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్న పాత్ర అయినా నటిస్తారు. హీరో హీరోయిన్స్ చాలా మంది అన్న చెల్లెళ్లుగా నటించి తర్వాత జంటగా కూడా నటించారు. అయితే సీనియర్ నటుడు నరేష్, నటి వాసుకి మాత్రం చాలా డిఫరెంట్.(Naresh Vasuki)
నరేష్ – వాసుకి ఇటీవల సుందరకాండ సినిమాలో తండ్రి కూతుళ్లుగా నటించారు. నారా రోహిత్ సినిమాలో వాసుకి రోహిత్ కి అక్కగా, నరేష్ కూతురిగా ఓ ప్రగ్నెంట్ వుమెన్ పాత్రలో కనిపించి మెప్పించింది. ఈ సినిమాలో తండ్రీకూతుళ్లుగా ఈ ఇద్దరూ బాగానే సెట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ భార్యాభర్తలుగా కనిపించబోతున్నారు.
Also Read : Manchu Manoj : ‘మిరాయ్’ సినిమాకు మంచు మనోజ్ రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లు తెలుసా? తేజ సజ్జ కంటే ఎక్కువ?
అంకిత్ కొయ్య, నీలఖి జంటగా రాబోతున్న బ్యూటీ సినిమా సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నరేష్ – వాసుకి హీరోయిన్ తల్లి తండ్రి పాత్రల్లో నటించారు. అంటే భార్యాభర్తలుగా నటించారు. ట్రైలర్ లో చూస్తే వీరిద్దరి మధ్య బాండింగ్ బాగానే ఉంది. భార్యాభర్తలుగా బాగానే సెట్ అయ్యారు అనిపిస్తుంది.
తాజాగా సినిమా దర్శకుడు వర్ధన్ మీడియాతో మాట్లాడుతూ.. మొదట వాసుకి గారు నరేష్ గారికి వైఫ్ అంటే ఎవరూ ఒప్పుకోలేదు. ఇటీవల సుందరకాండ సినిమాలో నరేష్ గారికి కూతురిగా వాసుకి గారు నటించారు. ఇందులో భార్యగా చేశారు. బ్యూటీ సినిమా చూశాక వారిద్దరూ సెట్ అవ్వలేదు అనిపించదు. ఇద్దరూ కలిసి పర్ఫెక్ట్ గా ఎమోషన్ ని పండించారు అని అన్నాడు. మరి సుందరకాండ సినిమాలో తండ్రీకూతుళ్లుగా మెప్పించిన నరేష్ వాసుకి బ్యూటీ సినిమాలో భార్యాభర్తలుగా ఎలా మెప్పిస్తారో చూడాలి.
బ్యూటీ ట్రైలర్ ఇక్కడ చూసేయండి..