Mirai Collections : అదరగొడుతున్న ‘మిరాయ్’.. మూడు రోజుల కలెక్షన్స్ ఎన్ని కోట్లు..? బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకెంత కావాలి?

మిరాయ్ సినిమా కలెక్షన్స్ అదరగొడుతుంది. మూడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే.. (Mirai Collections)

Mirai Collections : అదరగొడుతున్న ‘మిరాయ్’.. మూడు రోజుల కలెక్షన్స్ ఎన్ని కోట్లు..? బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకెంత కావాలి?

Mirai Collections

Updated On : September 15, 2025 / 12:16 PM IST

Mirai Collections : తేజ స‌జ్జా, రితిక నాయక్ జంటగా, మంచు మనోజ్ విలన్ గా తెరకెక్కిన మిరాయ్ సినిమా ఇటీవల సెప్టెంబర్ 12 న రిలీజయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మాణంలో కార్తీక్ ఘట్టమనేని ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా భారీగా తెరకెక్కింది. డివోషనల్ సస్పెన్స్ కథాంశంతో ఫాంటసీగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అవుతుంది.(Mirai Collections)

మొదటి రోజే మిరాయ్ సినిమా 27 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి భారీ ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. నిన్నటితో మూడు రోజుల్లో మిరాయ్ సినిమా 81.2 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ లెక్కన మిరాయ్ సినిమా భారీగా కలెక్ట్ చేస్తున్నట్టే.

Also Read : Pawan Kalyan : OG హుడీ వేసి మరీ డబ్బింగ్ చెప్పించారుగా.. పవర్ స్టార్ పవర్ ఫుల్ డబ్బింగ్ ఫినిష్..

మిరాయ్ సినిమాకు 60 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ ఆల్మోస్ట్ 44 కోట్లకు జరిగింది. ఈ లెక్కన సినిమా హిట్ అవ్వాలంటే 90 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయాలి. మూడు రోజుల్లోనే 81 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకో 9 కోట్లు కలెక్ట్ చేస్తే మిరాయ్ బ్రేక్ ఈవెన్ అయినట్టే. నేటితో ఈజీగా వంద కోట్లు వసూలు చేస్తుందని ఫుల్ ప్రాఫిట్స్ తో మిరాయ్ దూసుకుపోతుందని భావిస్తున్నారు.

ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ నుంచి కూడా మిరాయ్‌ సినిమాకు 45 కోట్లు వచ్చాయట. దీంతో ఇటు నిర్మాతకు, అటు డిస్ట్రిబ్యూటర్స్ కు ఓవరాల్ గా మిరాయ్ మంచి ప్రాఫిట్స్ ఇస్తుంది. అమెరికాలో కూడా మిరాయ్ ఆల్మోస్ట్ 2 మిలియన్ డాలర్స్ కి దగ్గర్లో ఉంది. మొత్తానికి తేజ సజ్జ హనుమాన్ తర్వాత మరో భారీ హిట్ కొట్టేసాడు.

Mirai Collections

Also Read : Pawan Kalyan : పవర్ స్టార్ కి గ్రాండ్ ఫేర్‌వెల్ ఇచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. పవన్ చేతిని పట్టుకొని హరీష్ శంకర్..