Adhila Noora : బిగ్ బాస్ లో లెస్బియన్ జంట.. వీళ్ళ గురించి తెలుసా? ఇంటర్ నుంచి లవ్.. సినిమాకి ఏ మాత్రం తగ్గదు వీళ్ళ లవ్ స్టోరీ..
మలయాళం బిగ్ బాస్ షోలోకి ఒక లెస్బియన్ జంట కూడా పాల్గొంటుంది. (Adhila Noora)

Adhila Noora
Adhila Noora : ప్రస్తుతం అన్ని సినీ పరిశ్రమలలో బిగ్ బాస్ నడుస్తున్న సంగతి తెలిసిందే . మలయాళంలో కూడా బిగ్ బాస్ సీజన్ 7 నడుస్తుంది. మలయాళంలో బిగ్ బాస్ సీజన్ 7 మొదలయి ఇప్పటికే కొన్ని వారాలు గడుస్తుంది. అయితే ఈ షోలోకి ఒక లెస్బియన్ జంట కూడా వచ్చింది. షోలో ఈ లెస్బియన్ జంట కలిసి ఆడుతున్నారు. ఇద్దర్ని కలిపి ఒకే కంటెస్టెంట్ గా ఎంట్రీ తీసుకోవడం గమనార్హం.(Adhila Noora)
కేరళకు చెందిన అదిలా నసరైన్, ఫాతిమా నూరా ఇద్దరూ లెస్బియన్ జంట. ఇప్పుడు ఇద్దరి పేర్లు కలిపి అదిలా నూరాగా వైరల్ అవుతున్నారు. కేరళకు చెందిన వీళ్ళ ఫ్యామిలిలు సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు అక్కడ 12వ తరగతి చదువుతుండగా వీరిద్దరి మధ్య పరిచయం ఏరపడింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ, రొమాంటిక్ రిలేషన్ ఏర్పడింది. అనుకోకుండా వీళ్ళ ఫ్యామిలీలు కేరళ లోని కోజికోడ్ లో ఒకే కాలేజీలో వీళ్ళిద్దర్నీ చదివిద్దాం అని ఎవరింట్లో వాళ్ళు అనుకున్నారు. వీళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయి చదువు అయ్యాక పెళ్లి చేసుకుందాం అనుకున్నారు.
కానీ ఈ లోపే విషయం అదిలా, నూరా ఇళ్లల్లో తెలిసిపోయింది. వాళ్ళని కాలేజీలో జాయిన్ చేయలేదు. దీంతో ఇద్దరూ ఇంట్లోంచి కోజికోడ్ వెళ్ళిపోయి ఒకచోట దాక్కున్నారు. అదిలా ఫ్యామిలీ వీళ్ళను కనిపెట్టి అదిలాని కొట్టి తీసుకెళ్లిపోయారు. మరోవైపు నూరా ఫ్యామిలీ అదిలా ఫ్యామిలీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. కొన్నాళ్ళు ఫ్యామిలీ వల్ల దూరం ఉన్నారు అదిలా, నూరా.
అనంతరం అదిలా హైకోర్టు లో తమ ప్రేమ, పెళ్ళికి అనుమతి ఇవ్వాలని LGBT హక్కుల కింద పిటిషన్ వేసింది. అదే సమయంలో నూరా సోషల్ మీడియా లో లైవ్ కి వచ్చి జనాల నుంచి సింపతీ తెచ్చుకుంది. దీంతో ఈ లెస్బియన్ జంట వైరల్ గా మారింది. కేరళ హైకోర్టు కూడా వీరి పెళ్ళికి పర్మిషన్ ఇచ్చింది. ఈ జంట 2022 లో పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో వీరి పెళ్లి ఫొటోలు వైరల్ అయ్యాయి.
Also Read : Mouli Tanuj Prasanth : ‘లిటిల్ హార్ట్స్’ హీరో మౌళి లవ్ స్టోరీ తెలుసా? రియల్ లైఫ్ లో కూడా సీనియర్ నే..
Adhila Noora
ప్రస్తుతం ఇద్దరూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ ఇన్‌ఫ్లుయెన్సర్స్ గా ఫేమ్ తెచ్చుకున్నారు. అంతే కాకుండా ఇద్దరూ సైబర్ సెక్యూరిటీ విభాగంలో జాబ్స్ కూడా చేస్తున్నారు. ఇటీవలే మలయాళ బిగ్ బాస్ లోకి వీరిద్దరూ కలిసి ఎంట్రీ ఇవ్వడంతో మరో సారి ఈ జంట వైరల్ గా మారింది. కొన్ని వారాలుగా వీళ్ళు బిగ్ బాస్ లో సాగుతున్నారు. వీరికి కూడా మంచి సపోర్ట్ ఉంది. మరి బిగ్ బాస్ కప్ గెలుస్తారేమో చూడాలి.మలయాళం బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్న మోహన్ లాల్ కూడా వీరిని అభినందించి తన ఇంటికి పిలుస్తాను అన్నారు.
View this post on Instagram
View this post on Instagram