Bharateeyudu 2 : సీఎం రేవంత్ రెడ్డి దెబ్బకి.. ఆ పని మొదలుపెట్టిన ‘భారతీయుడు 2’ టీమ్..

రేవంత్ రెడ్డి చెప్పింది మొదట భారతీయుడు 2 సినిమా యునిట్ తోనే మొదలైంది అని అంటున్నారు.

CM Revanth Reddy Orders Initiate Bharateeyudu 2 Movie Team Drugs Awareness Video goes Viral

Bharateeyudu 2 : ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ నివారణలో భాగంగా సినిమా వాళ్లపై వ్యాఖ్యలు చేస్తూ.. సినిమా వాళ్లకు సామాజిక బాధ్యత ఉండాలి. ఇకపై సినిమా వాళ్లకు టికెట్ రేట్లు పెంచాలన్నా, సినిమాకు ఏదైనా సహాయం కావాలన్నా ఆ సినిమాలోని నటీనటులు డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ వీడియోలు తీయాలి అని చెప్పారు. అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సినిమా వాళ్ళ దగ్గర్నుంచి వివిధ రకాల స్పందనలు వచ్చాయి.

సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేసిన తర్వాత తెలుగులో రిలీజయ్యే మొదటి సినిమా కమల్ హాసన్ భారతీయుడు 2. ఈ సినిమా జులై 12న రిలీజ్ కానుంది. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. అయితే నిన్న జరిగిన భారతీయుడు 2 సినిమా ప్రెస్ మీట్ లో ఓ మీడియా ప్రతినిధి సినిమాలోని నటీనటుల్ని రేవంత్ రెడ్డి విధించిన షరతు గురించి, నటీనటులకు సామాజిక బాధ్యత ఉందా అని అడిగారు.

Also Read : Disha Patani : కల్కి కోసం నడుము మీద టాటూ వేసుకున్న దిశా పటాని.. అది ఏ భాష? దాని అర్ధం ఏంటి అంటే.. ?

దీనికి సిద్దార్థ్ సమాధానమిస్తూ.. సామాజిక బాధ్యత నా బాధ్యత. ఒక చీఫ్ మినిష్టర్ చెప్తే నాకు రాదు. ప్రతి యాక్టర్ కి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందా అంటే నా దగ్గర కామెంట్స్ లేవు. కానీ ప్రతి యాక్టర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అది మేము సమయాన్ని బట్టి బయట పెడతాము. సీఎం గారు ఏం అడిగారో అది మేము చేస్తాం. ఏ సీఎం మాకు మీరు ఇది చేస్తే మీకు ఇది చేస్తాం అని చెప్పలేదు అని అన్నారు. దీంతో సిద్దార్థ వ్యాఖ్యలు నెగిటివ్ గా ప్రమోట్ అయ్యాయి.

కానీ సాయంత్రానికి భారతీయుడు 2 మూవీ టీమ్ లోని నటీనటులు కమల్ హాసన్, సిద్దార్థ్, సముద్రఖని, డైరెక్టర్ శంకర్.. డ్రగ్స్ వాడొద్దు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి పని చేస్తున్నారు అంటూ చెప్తూ ఓ చిన్న వీడియో రిలీజ్ చేసారు. దీంతో రేవంత్ రెడ్డి చెప్పింది మొదట భారతీయుడు 2 సినిమా యునిట్ తోనే మొదలైంది అని అంటున్నారు. ఈ లెక్కన రేవంత్ రెడ్డి పెట్టిన షరతుకు అన్ని సినిమా యూనిట్స్ తమ నటీనటులతో ఇలా డ్రగ్స్ నివారణపై వీడియోలు చేస్తారని తెలుస్తుంది.

ట్రెండింగ్ వార్తలు