CM Vijay : పవన్ OG సినిమాటోగ్రఫర్ కి పదవి ఇచ్చిన సీఎం విజయ్.. విమర్శిస్తున్న ప్రతిపక్షాలు..
తాజాగా సీఎం విజయ్ స్టార్ సినిమాటోగ్రాఫర్ కి ఓ పదవి ఇవ్వడంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. (CM Vijay)
- Saketh U
- Published on- June 20, 2026 / 03:47 PM IST
CM Vijay
CM Vijay : స్టార్ హీరో విజయ్ తమిళనాడు సీఎం అయ్యాక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నాడు. మరోపక్క ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కుంటున్నారు. తాజాగా సీఎం విజయ్ స్టార్ సినిమాటోగ్రాఫర్ కి ఓ పదవి ఇవ్వడంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
స్టార్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస తమిళ్, తెలుగు, మలయాళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పనిచేసారు. తెలుగులో ఏ మాయ చేసావే, రేసుగుర్రం, బ్రూస్లీ, రాధేశ్యామ్, గుంటూరు కారం, పవన్ కళ్యాణ్ OG, హరిహర వీరమల్లు సినిమాలకు పనిచేసారు. తమిళ్ లో సీఎం విజయ్ తో కలిసి నంబన్, లియో, బీస్ట్ సినిమాకు కలిసి పనిచేసారు. ఆయనకు సాంకేతికంగా సినిమాటోగ్రఫీపై చాలా నాలెడ్జ్ ఉంది. ఖాళీ సమయంలో సినిమాటోగ్రఫీ క్లాసులు చెప్పడం, వర్క్ షాప్స్ నిర్వహించడం చేస్తారు.
Also Read : Samantha : సమంత ప్రమోషన్స్‌లో అలా చెప్పింది.. సినిమాలోనేమో ఇలా ఉంది.. మా ఇంటి బంగారం..
తాజాగా సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంసను తమిళనాడు ప్రభుత్వ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ (TNMGRFTV) ఛైర్మన్‌గా సీఎం విజయ్ నియమించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దీంతో సన్నిహితులకు విజయ్ పదవులు ఇచ్చుకుంటున్నాడని ఆరోపిస్తున్నారు ప్రతిపక్షాలు. ఈ నియామకం ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో చర్చగా మారింది.
అయితే మనోజ్ పరమహంస ఒకప్పుడు చెన్నైలోని MGR ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌లోనే చదవడం గమనార్హం. ఆ తర్వాత అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ మొదలుపెట్టి పలు సినిమాలకు పనిచేసి ఈరం సినిమాతో సినిమాటోగ్రాఫర్‌గా మారారు. నిర్మాతగా కూడా పలు సినిమాలను తెరకెక్కించారు మనోజ్.
