Samantha : సమంత ప్రమోషన్స్‌లో అలా చెప్పింది.. సినిమాలోనేమో ఇలా ఉంది.. మా ఇంటి బంగారం..
ఈ సినిమాకు హైలెట్ సమంత యాక్షన్ సీక్వెన్స్ లే. (Samantha)
Samantha
Samantha : సమంత మా ఇంటి బంగారం సినిమా జూన్ 19న రిలీజయి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆల్మోస్ట్ ఏడేళ్ల తర్వాత సమంత మెయిన్ లీడ్ గా వచ్చిన సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. మొదటి రోజే మా ఇంటి బంగారం సినిమాకు దాదాపు 13 కోట్ల గ్రాస్ వచ్చినట్టు మూవీ యూనిట్ ప్రకటించింది.
ఈ సినిమాకు హైలెట్ సమంత యాక్షన్ సీక్వెన్స్ లే. చీరకట్టులో సమంత యాక్షన్ సీక్వెన్స్, ఫైట్స్ అదరగొట్టేసింది. సినిమాలో కార్ ఛేజింగ్ సీక్వెన్స్ తో పాటు, మరో మూడు యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయి. వీటిల్లో సమంతకు బోలెడన్ని బిల్డప్ షాట్స్, స్లో మోషన్ షాట్స్ ఉన్నాయి. హీరోలకు ఎలివేషన్స్ ఇవ్వటానికి ఫైట్స్ లో స్లో మోషన్, బిల్డప్ షాట్స్ పెడతారు. దానికి తగ్గ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పడితే ఆ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి.
అలా మా ఇంటి బంగారం సినిమాలో కూడా సమంత చేసే యాక్షన్స్ కి అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి మధ్యమధ్యలో ఎలివేషన్స్, బిల్డప్, స్లో మోషన్ షాట్స్ ఇచ్చారు. అయితే సినిమా రిలీజ్ ముందు సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హీరోలకు యక్ష్ణ సీక్వెన్స్ లలో ఎలివేషన్స్ ఇచ్చేలాగా ఈ సినిమాలో స్లో మోషన్స్, బిల్డప్ షాట్స్ లేవు. అంతా సహజంగా ఉంటుంది అని తెలిపింది. కానీ సినిమాలోనేమో అవే ఉన్నాయి. అలా ఉండటం మంచిదే కదా, మరి ప్రమోషన్స్ లో సమంత ఎందుకు అలా చెప్పడం అని అంటున్నారు.
