Cockroach
Cockroach : సొంత ఊరు, గంగపుత్రులు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, గల్ఫ్, వలస.. లాంటి పలు సినిమాలతో అవార్డులు అందుకున్న దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా కాక్రోచ్. అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై బి.బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు.(Cockroach)
తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించి కాక్రోచ్ సినిమా మార్చి 6న థియేటర్స్ లో రిలీజ్ అవుతుందని ప్రకటించారు.
Also Read : Harish Shankar : పొలిటికల్ కంటెంట్ లేదు.. పవన్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన హరీష్ శంకర్..
ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత బి.బాపిరాజు మాట్లాడుతూ.. ఈ డైరెక్టర్ తో మంచి సినిమాలు తీసాము. మేము కలిసి చేస్తున్న మరో డిఫరెంట్ సినిమా ఇది. సమాజంలో జరుగుతున్న ఘటనలకు వాస్తవిక రూపంగా ఈ సినిమాను రియల్ లొకేషన్స్ లో రిస్కీ షూటింగ్ చేశాము. మార్చి 6న ఈ సినిమా రిలీజ్ కానుంది అని తెలిపారు.
దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన నేను సమాజంలో చూసిన వాటిని ప్రేక్షకులకు తెలియజేయాలి అలాంటి సినిమాలే తీస్తున్నాను. ఈ సినిమా చేసే ముందు పోలీస్ డిపార్ట్మెంట్ వారి సపోర్ట్ తో అనేక కేసులను స్ట చేసి, వైజాగ్ లో ఉండే కొందరు నేరస్తుల నిజ జీవిత ఘటనల ఆధారంగా ఒక వయలెంట్ లవ్ స్టోరీగా ఈ సినిమాని తెరకెక్కించాను. మురికి కూపాలలో ఉన్న నేరస్థుల జీవితాల్లోని అనుభవాలు, ప్రేమలు విచిత్రంగా అనిపించాయి. మనకు తెలియని ఒక ప్రపంచాన్ని చూపించే సినిమా ఇది. ఈ సినిమాని డార్క్ గా, ఓపెన్ గా, బోల్డ్ గా తీసాం. చిన్న పిల్లలు, సున్నిత మనస్కులు ఈ సినిమాకి దూరంగా ఉండండి అని అన్నారు.
Also Read : Chiranjeevi Balakrishna : ఏంటి.. నిజంగానే బాలయ్య – చిరు కలుస్తున్నారా? అదే జరిగితే..