Sandeep Raj : ఘనంగా ఆ నటితో కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ వివాహం.. హాజరైన సినీ ప్రముఖులు..

కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ ఇటీవల ఎంగేజ్ మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

Color photo movie director Sandeep Raj got married

Sandeep Raj : కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ ఇటీవల ఎంగేజ్ మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. చాందినీ రావుతో నిశ్చితార్థం చేసుకున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. తాజాగా ఈ జంట పెళ్లి పీటలెక్కారు. ఈ రోజు తిరుపతిలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇక వీరి వివాహానికి పలువురు కుటుంబ సభ్యులతో పాటు ఆయన ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు. అతితక్కువ మంది సమక్షంలో చాందిని మెడలో మూడుముళ్లు వేసాడు సందీప్ రాజ్.

Also Read : Akshara Gowda : పండంటి బిడ్డకి జన్మనిచ్చిన ప్రముఖ హీరోయిన్.. బిడ్డ ఫొటోలు షేర్ చేస్తూ..

ఇక ఈ పెళ్ళికి వచ్చిన వారిలో టాలీవుడ్ నటి దివ్య శ్రీపాద, నటుడు వైవా హర్ష, యాంకర్ సుమ కొడుకు రోషన్, టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్, ఆయన భార్య, అలాగే నటి ప్రియా వడ్లమాని ఉన్నారు. ఇక వీరందరూ కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ ఫ్రెండ్స్. కాగా సుహాస్ తో ఆయన కలర్ ఫోటో సినిమా తీసాడు కాబట్టి వీరిద్దరి మధ్య మంచి అనుభందం ఉంది. ఆ సినిమా అప్పటి నుండి వీరిద్దరి మధ్య మంచి అనుభందం ఉంది. అందుకే తన భార్యతో కలిసి సందీప్ రాజ్ పెళ్ళికి వచ్చాడు సుహాస్.

దీంతో సందీప్ రాజ్ పెళ్లి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక చాందిని, సందీప్ ఇద్దరూ కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. ఆయన చేసిన పలు సినిమాల్లో నటించింది చాందిని. అలా అప్పుడు మొదలైన వీరి ప్రేమ పెళ్లి వరకు చేరింది. చాందిని రణస్థలి, అహం బ్రహ్మాస్మి, లవ్ డ్రైవ్ వంటి సినిమాలతో పాటు హెడ్స్ అండ్ టేల్స్ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించింది. అలాగే రంగస్థలంలోనూ ఓ చిన్న పాత్రలో నటించింది.