Ali: సబ్బుకు లక్ష్మీ పూజ ఏంటి? హిందూ సంఘాల ఆగ్రహం.. బహిరంగ క్షమాపణలు చెప్పిన అలీ
సబ్బు ప్రకటన వివాదంపై బహిరంగా క్షమాపణలు చెప్పిన హాస్యనటుడు అలీ(Ali).
- V Santhosh Kumar
- Published on- May 13, 2026 / 04:28 PM IST
Comedian Ali Apologizes Over Ghar Soap Ad Controversy
- మత విశ్వాసాలతో అలీ చెలగాటం.
- నెటిజన్ల ట్రోలింగ్‌తో దిగివచ్చిన నటుడు.
- క్షమాపణలు చెప్పి వీడియో డిలీట్.
Ali: టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ అలీ ఒక ప్రైవేట్ సబ్బు ప్రకటనలో నటించి కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఈ యాడ్‌లో ఆయన సబ్బుకు లక్ష్మీ పూజ చేస్తూ, మంత్రాల మధ్య ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలోని భక్తి గీతాన్ని పేరడీగా ఉపయోగించడం విమర్శలకు దారితీసింది. మతపరమైన విశ్వాసాలను వ్యాపార ప్రకటన కోసం అపహాస్యం చేశారంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్రోలింగ్ పెరగడంతో పాటు అనేక మంది తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ అంశం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
Avatar 3 OTT: ఎట్టకేలకు OTTలోకి అవతార్ 3.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
పరిస్థితి తీవ్రతను గమనించిన అలీ(Ali) తక్షణమే స్పందించి బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆ ప్రకటన రూపొందించిన సంస్థ ముంబైకి చెందినదని, ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశ్యం తనకు లేదని ఆయన వివరణ ఇచ్చారు. భక్తజనుల మనోభావాలను గౌరవిస్తూ సదరు వీడియోను అన్ని ప్లాట్‌ఫారమ్స్ నుండి తొలగించినట్లు స్పష్టం చేశారు. “తెలియక జరిగిన తప్పుకు మనస్ఫూర్తిగా క్షమించమని కోరుతున్నాను” అంటూ ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేయడంతో ఈ వివాదానికి తెరపడింది.
Soap Ad Lands Ali in Controversy
Hindu organizations have raised objections to a soap advertisement featuring Ali. As the controversy intensified, Ali issued an apology.#Ali #SoapAd #Controversy #Tollywood #Trending pic.twitter.com/ikLM1BjsM8
— Telangana Ahead (@telanganaahead) May 13, 2026
