×
Ad

Brahmanandam: ఆయన మా కుటుంబసభ్యులు.. స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న బ్రహ్మానందం.. వీడియో వైరల్

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన నటనను కాదు(Brahmanandam) జస్ట్ అలా కనిపిస్తేనే నవ్వే వాళ్ళు చాలా మందే ఉన్నారు. అందుకే ఆయన హాస్యబ్రహ్మ అయ్యారు.

Comedian Brahmanandam gets emotional remembering Balasubramaniam

Brahmanandam: హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన నటనను కాదు జస్ట్ అలా కనిపిస్తేనే నవ్వే వాళ్ళు చాలా మందే ఉన్నారు. అందుకే ఆయన హాస్యబ్రహ్మ అయ్యారు. ఆయన నవ్వుతూ.. అందరిని నవ్వించే బ్రహ్మానందం తాజాగా కన్నీళ్లు పెట్టుకున్నారు. అది కూడా (Brahmanandam)ఒక షోకి గెస్ట్ హాజరై. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అసలు విషయం ఏంటంటే.. ఇండియన్ ఐడల్ తెలుగు ప్రముఖ ఓటీటీ ఆహాలో టెలికాస్ట్ అవుతున్న విషయం తెలిసిందే.

Ahaana Krishna: కొత్త కారు కొన్న కొత్త లోకా బ్యూటీ.. ఎంత క్యూట్ గా ఉందో.. ఫోటోలు చూశారా..

తాజాగా ఈ షోకి గెస్ట్ గా హాజరయ్యారు బ్రహ్మానందం. ఇక సంగీతానికి, పాటలకి సంబందించిన షో కాబట్టి గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించి మాట్లాడకుండా ఉండేలాం కదా. ఇందులో భాగంగానే, యాంకర్ బాలసుబ్రమణ్యంతో బ్రహ్మానందంకి ఉన్న అనుబంధం గురించి అడిగింది. దానికి ఒక్కసారిగా ఎమోష్నల్ అయినా బ్రహ్మనందం బాలసుబ్రమణ్యం గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బాలసుబ్రమణ్యంతో నాకు గొప్ప అనుబంధం ఉంది. ఆయన మా కుటుంబసభ్యుడి లాంటివారు” అంటూ ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబందించిన ప్రోమో విడుదల కాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక బ్రహ్మానందం ఎమోషనల్ అవడం చూసి ఆడియన్స్ కూడా ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు.