Fish Venkat : కమెడియన్ ఫిష్ వెంకట్.. ఇప్పుడు దయనీయ స్థితిలో.. కాళ్ళు పాడయి.. డబ్బులు లేక, కొడుకులు పట్టించుకోక..

ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫిష్ వెంకట్ తన బాధలు చెప్పుకొని ఎమోషనల్ అయ్యాడు.

Fish Venkat Image Credits : Suman TV

Fish Venkat : ఆది సినిమాలో తొడగొట్టు చిన్నా అనే డైలాగ్ తో గుర్తింపు తెచ్చుకొని కమిడియన్ గా, విలన్ గా దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించారు ఫిష్ వెంకట్. ఎన్నో సినిమాల్లో తన కామెడీతో నవ్వించాడు ఫిష్ వెంకట్. సినిమాల్లో బాగా ఎదిగిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దయనీయ స్థితిలో ఉన్నాడు. ఒకప్పుడు ఎంతోమందికి దానాలు చేసిన ఫిష్ వెంకట్ ఇప్పుడు చేయి చాచే స్థితిలో ఉన్నాడు.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఫిష్ వెంకట్ ని ఇంటర్వ్యూ చేసింది. ఫిష్ వెంకట్ గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. అతని కుడి కాలు అంతా పాడయింది. ఫిష్ వెంకట్ ప్రస్తుతం రామ్ నగర్ లోని తన ఇంట్లోనే దయనీయ జీవితం గడుపుతున్నాడు. ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫిష్ వెంకట్ తన బాధలు చెప్పుకొని ఎమోషనల్ అయ్యాడు.

Also Read : Tollywood Donations : తెలుగు రాష్ట్రాల్లో వరదలు.. సినీ ప్రముఖుల భారీ విరాళాలు.. ఎవరెవరు ఎంతిచ్చారంటే..?

ఫిష్ వెంకట్ మాట్లాడుతూ.. షుగర్ వల్ల కాలు బాగా లావు అయింది. నాలుగేళ్ళ క్రితం ఆపరేషన్ చేసారు. ఆ తర్వాత కూడా కాలుకు ఎఫెక్ట్ అయింది. అప్పట్నుంచి ఇలా కాలు మీద చర్మం పోతుంది. అప్పట్నుంచి వీక్ అయ్యాను. కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయి. సంవత్సరంన్నర క్రితంనుంచి డయాలసిస్ కూడా చేస్తున్నారు. ఇద్దరు కొడుకులు, ఒక అమ్మాయి ఉంది. కొడుకులు ఫైనాన్సియల్ గా పట్టించుకోవట్లేదు. అప్పుడప్పుడు కూతురే సపోర్ట్ చేస్తుంది. ఒకప్పుడు చాలా మందికి ఇచ్చాను, ఇప్పుడు ఎవర్ని చేయి చాచి అడగలేను అంటూ ఎమోషనల్ అయ్యాడు.

అలాగే.. ఆపరేషన్స్ కు, డయాలసిస్ కు లక్షలు ఖర్చయ్యాయి. ఆ తర్వాత కొంతమంది మంత్రులు, తెలిసిన వాళ్ళు సహాయం చేసారు. డైరెక్టర్ వినాయక్ సర్ కూడా సహాయం చేసారు. నేనే ఎవరికీ చెప్పట్లేదు నాకు ఇలా అయింది అని. అడిగితే సినీ పరిశ్రమలో కొంతమంది సహాయం చేస్తారు. ఇప్పుడు ఏ పని చెయ్యట్లేదు, షూటింగ్స్ కి వెళ్లే ఓపిక లేదు. ఇంట్లో తినడానికి మాత్రం నడుస్తుంది అని అన్నారు. ఒకప్పుడు కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన ఫిష్ వెంకట్ ఇప్పుడు ఇలా దయనీయ స్థితిలో చూసి అయ్యో పాపం అనుకుంటున్నారు నెటిజన్లు.

ట్రెండింగ్ వార్తలు