Actor Prudhvi : స్టార్ హీరో కొడుకుతో కమెడియన్ ఫృథ్వీ రాజ్ కుమార్తె పెళ్లి?

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫృథ్వీ రాజ్ కుమార్తె శ్రీలు ఓ స్టార్ హీరో ఇంటికి కోడలిగా వెళ్లబోతున్నారనే వార్త హల్చల్ చేస్తోంది. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఫృథ్వీ రాజ్ ఈ విషయంపై చెప్పిన మాటలు కూడా ఆసక్తిని రేపుతున్నాయి.

Actor Prudhvi

Actor Prudhvi : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫృథ్వీ రాజ్ తెలియని వారుండరు. ఇటు సినిమా.. అటు రాజకీయాలను ఊపు ఊపారు. ప్రస్తుతం ఆయన కూతురు శ్రీలు కూడా సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవల ఫృథ్వీ రాజ్ కుమార్తె శ్రీలు ఓ స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్లబోతున్నారనే వార్త వైరల్ అవుతోంది.  ఇందులో నిజమెంత? మీడియాతో మాట్లాడిన ఫృథ్వీ రాజ్, ఆయన కుమార్తె ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారా?

Aadi Keshava Review : ఆదికేశవ మూవీ రివ్యూ.. రుద్రకాళేశ్వరుడిగా వైష్ణవ్ ఊర మాస్..

కమెడియన్ ఫృథ్వీ రాజ్ తనదైన కామెడీతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. నటన, రాజకీయాల్లో బిజీగా ఉన్న టైమ్‌లో కొన్ని విమర్శలు కూడా ఎదుర్కుని పదవిని కూడా కోల్పోయారు. ప్రస్తుతం సినిమాలకు ప్రాముఖ్యత ఇస్తూ ముందుకు వెళ్తున్న ఫృథ్వీ రాజ్ తన కుమార్తెను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ ‘కొత్త రంగుల ప్రపంచం’ అనే సినిమాను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా తండ్రి, కూతుళ్లు మీడియాలో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

ఇటీవల ఓ స్టార్ హీరో ఇంటికి ఫృథ్వీ రాజ్ కుమార్తె శ్రీలు కోడలిగా వెళ్లబోతోందంటూ వార్తలు హల్చల్ చేశాయి. దీనిపై ఫృథ్వీ రాజ్ మాట్లాడారు. వెళ్లవచ్చేమో? ఫ్యూచర్ మన చేతుల్లో లేదు కదా.. అంటూ ప్రేమ, పెళ్లిళ్ల గురించి ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు. కానీ పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. ఆడపిల్లలకు తెలుగు సినిమాల్లో ఛాన్సుల ప్రస్తావన తెచ్చిన ఫృథ్వీ ఇండస్ట్రీలో తెలుగు ఆడపిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. తన కూతురి విషయంలోనే ఇలా ఉందంటే బయట ఆడపిల్లలు ఎంత సఫర్ అవుతున్నారో అంటూ కామెంట్స్ చేశారు.

Pushpa 2 : అన్‌స్టాపబుల్ షోలో పుష్ప 2 స్టోరీ లీక్ చేసిన రణబీర్ కపూర్..!

పాలిటిక్స్ వేరు.. సినిమాలు వేరని సినిమా రంగంలో ఆడవారిని ఏది పడితే అది మాట్లాడకూడదని వారికి సముచితమైన గౌరవం ఇవ్వాలని అన్నారు ఫృథ్వీ. తాను ఎంతోమంది యాక్ట్రెస్‌తో నటించానని వారందరితో చాలా గౌరవంగా మెలిగానని చెప్పుకొచ్చారు. పొలిటికల్‌గా బ్యాడ్ ఇన్సిడెంట్ ఎదురైన సమయంలో ఫృథ్వీ రాజ్ సూసైడ్ చేసుకోవాలని అనుకున్నారట. టాబ్లెట్లు మింగేద్దామా?.. ఏ రకంగా చనిపోవాలనే ఆలోచనలతో ఉన్నారట. తీవ్ర అనారోగ్యంతో డెత్ బెడ్ మీద ఉన్న తండ్రిని కాపాడుకున్నామని చెప్పారు శ్రీలు. ఆయనను ఒంటరిగా ఉండనివ్వకుండా ఎప్పుడూ సంతోషంగా చూసుకుంటూ వస్తున్నామని శ్రీలు చెప్పారు. ఇక శ్రీలు ఎవరింటికి కోడలిగా వెళ్లబోతోందనే వార్త మాత్రం ఆసక్తికరంగా మారింది. శ్రీలు ప్రేమలో ఉన్న ఆ హీరో ఎవరనేది ఇంకా క్లారిటీ లేదు.

ట్రెండింగ్ వార్తలు