కొత్త సినిమాలు – దసరా శుభాకాంక్షలు

విజయదశమి సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. పలు కొత్త సినిమాల పోస్టర్స్, టీజర్స్ అండ్ ట్రైలర్స్ విడుదల చేశారు దర్శక, నిర్మాతలు..

  • Publish Date - October 8, 2019 / 10:46 AM IST

విజయదశమి సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. పలు కొత్త సినిమాల పోస్టర్స్, టీజర్స్ అండ్ ట్రైలర్స్ విడుదల చేశారు దర్శక, నిర్మాతలు..

విజయదశమి సందర్భంగా అక్టోబర్ 7, 8 తేదీలలో కొత్త సినిమా అప్‌డేట్స్ భారీగా వచ్చాయి. సినీ ప్రియులు, ప్రేక్షకులు కొత్త సినిమాల సమాచారంతో ఫుల్ ఖుష్ అవుతున్నారు. అక్టోబర్ 7న నటసింహా నందమూరి బాలకృష్ణ 105వ సినిమా నుండి కత్తి పట్టుకుని ఉగ్రనరసింహావతారంలో ఉన్న లుక్ విడుదల చేశారు మేకర్స్.. విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య మామా అల్లుళ్లుగా నటిస్తున్న ‘వెంకీమామ’ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ కోసం కొండారెడ్డి బురుజు ముందు గొడ్డలి పట్టుకుని నిల్చున్న స్టిల్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ మూవీ నుండి యాక్షన్ లుక్, నందమూరి కళ్యాణ్ రామ్ ‘ఎంతమంచి వాడవురా’ లుక్స్ విడుదలయ్యాయి.

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ , నభా నటేష్ నటించబోయే ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా ప్రారంభమైంది. రాజ్ తరుణ్, షాలినీ పాండే నటిస్తున్న ‘ఇద్దరి లోకం ఒక్కటే’ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. సాయి పల్లవి, ఫాహద్ ఫాజిల్ నటించిన ‘అనుకోని అతిథి’ ఫస్ట్ లుక్, మాస్ మహారాజ రవితేజ ‘డిస్కోరాజా’ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ.. అక్టోబర్ 19న ఫస్ట్ సాంగ్ రిలీజ్ చెయ్యనున్నట్టు తెలిపారు. ‘వెంకీమామ’ ఫస్ట్ గ్లింప్స్, ‘జార్జ్ రెడ్డి’ థియేట్రికల్ ట్రైలర్, ‘కృష్ణారావ్ సూపర్ మార్కెట్’ ట్రైలర్, జెడి చక్రవర్తి ‘MMOF’ (ఎమ్ఎమ్ఓఎఫ్) టీజర్ విడుదలయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో నటించబోయే సినిమా, నితిన్, కీర్తి సురేష్ నటించనున్న ‘రంగ్ దే!’ సినిమాలు పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయి.

Read Also : ‘సీనయ్య’గా వి.వి.వినాయక్ లుక్ చూశారా!

దళపతి విజయ్, అట్లీ దర్శకత్వంలో ద్విపాత్రాభినయం చేసిన ‘బిగిల్’ తెలుగు వెర్షన్ ‘విజిల్’, విశాల్, సుందర్ సి దర్శకత్వంలో నటిస్తున్న ‘యాక్షన్’, ‘సైకిల్’ ఫస్ట్ లుక్, ‘తిప్పరా మీసం’, ‘22’, ‘రాగల 24 గంటల్లో’, ‘రాజు గారి గది 3’, అధర్వ, మేఘా ఆకాష్ నటించిన ‘బూమరాంగ్’, శ్రీనివాస్ రెడ్డి దర్శక, నిర్మాతగా పరిచయమవుతున్న ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’, ‘చూసీ చూడంగానే’, ‘తోలుబొమ్మలాట’, తరుణ్ భాస్కర్ హీరోగా పరిచయమవుతున్న ‘మీకు మాత్రమే చెప్తా’, బెల్లంకొడం సాయి గణేష్‌ని హీరోగా పరిచయం చేస్తున్న బీటెల్ లీఫ్ ప్రొడక్షన్స్ & లక్కీ మీడియా సంస్థలు తెలుగు ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు చెప్తూ.. న్యూ పోస్టర్స్ రిలీజ్ చేశాయి..