Commitmental-Punarnavi Bhupalam: పునర్నవి భూపాలం ఎంగేజ్ మెంట్ అయిపోయింది అనే వార్త రకరకాలుగా వినిపించింది. బుధవారం ఆమె నిశ్చితార్థపు ఉంగరం ఫొటోని చూపిస్తూ.. ‘ఫైనల్లీ ఇట్స్‌హ్యాపెనింగ్’ అని పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.
కట్ చేస్తే.. పునర్నవి, ఉద్భవ్ కలిసి నటించిన ఓ వెబ్‌సిరీస్‌కోసం ఈ విధంగా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారని.. పెళ్లి విషయంలో వీళ్లు చెబుతున్నది వాస్తవం కాదని, పునర్నవి చేతికి ఉన్న రింగ్ కుడిచేతికి ఉంది కాబట్టి ఇది పెళ్లి మ్యాటర్ కానేకాదని, ప్రమోషన్ మ్యాటర్ అనే మాటలూ వినిపించాయి. ఇప్పుడు ఆ మాటలే నిజమయ్యాయి.
పునర్నవి, ఉద్భవ్ జంటగా నటించిన ‘Commitmental’ (కమిట్‌మెంటల్) వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో భాగమే ఈ పెళ్లి గోల అంతా.. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ ఫస్ట్ లుక్ శుక్రవారం రిలీజ్ చేశారు. నవంబర్ 13నుంచి పాపులర్ తెలుగు ఓటీటీ ఆహాలో ఈ సిరీస్ ప్రీమియర్స్ కానుంది.