Vishnu Priya: వివాదంలో విష్ణు ప్రియ.. డబ్బుకోసం అసభ్యకర కంటెంట్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏఐఎస్‌ఎఫ్
టాలీవుడ్ యాంకర్, నటి విష్ణు ప్రియ(Vishnu Priya)పై సూర్యారావుపేట సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు.
- V Santhosh Kumar
- Updated on- April 12, 2026 / 04:10 PM IST
Controversy Over Vishnu Priya Instagram Subscription
- విష్ణుప్రియపై సైబర్ క్రైమ్ కేసు
- అర్ధనగ్న వీడియోల కోసం డబ్బులా
- ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌పై ఏఐఎస్‌ఎఫ్ ఆగ్రహం
Vishnu Priya: బుల్లితెర నటి, యాంకర్ విష్ణుప్రియ భీమినేని సోషల్ మీడియా వేదికగా అసభ్యకర కంటెంట్‌ను ప్రోత్సహిస్తున్నారంటూ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అర్ధనగ్న వీడియోలను వీక్షించడానికి సభ్యత్వ రుసుము వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఏఐఎస్‌ఎఫ్ (AISF) నాయకులు విజయవాడలోని సూర్యారావుపేట సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Krithi Shetty: పాపం కృతి శెట్టి బ్యాడ్ లక్.. ‘lik’ ఎఫెక్ట్ అనిల్ రావిపూడి సినిమాపై పడుతుందా?
రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. సాయికుమార్ నేతృత్వంలో ఈ ఫిర్యాదు అందజేసిన నేతలు, సమాజంలో గుర్తింపు ఉన్న వ్యక్తులు డబ్బు కోసం యువతను తప్పుదోవ పట్టించడం దురదృష్టకరమని విమర్శించారు. ఇలాంటి చర్యల వల్ల సామాజిక నైతిక విలువలు దెబ్బతింటాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విష్ణుప్రియ(Vishnu Priya) ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తక్షణమే నిలిపివేయాలని, ఐటీ చట్టం కింద ఆమెపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.
‘పోవే పోరా’ వంటి షోల ద్వారా మంచి పేరు తెచ్చుకుని, బిగ్ బాస్ వంటి వేదికలపై కనిపించిన ఒక సెలబ్రిటీ ఇలాంటి వివాదాస్పద కంటెంట్‌ను ప్రచారం చేయడం సిగ్గుచేటని వారు మండిపడ్డారు. ఈ ఫిర్యాదు సమర్పించిన వారిలో పలువురు విద్యార్థి సంఘ నాయకులు కూడా ఉన్నారు. సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన వ్యక్తుల ప్రవర్తనపై మరోసారి చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఈ అంశాన్ని ఎలా పరిగణనలోకి తీసుకుంటారో వేచి చూడాలి. తనపై వస్తున్న ఈ తీవ్రమైన ఆరోపణలపై విష్ణుప్రియ ఇంకా స్పందించాల్సి ఉంది.
