కరోనా ఎప్పుడు వెళ్లిపోతుందో చెప్పిన నాని కొడుకు జున్ను..

  • Publish Date - April 14, 2020 / 02:23 PM IST

లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా అప్‌డేట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్, డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో వెబ్ సిరీస్, సినిమాలతో టైమ్ పాస్ చేస్తున్నారు. సెలబ్రిటీలు తమ రోజువారీ పనుల తాలుకూ విషయాలను, వర్కౌట్స్, ఇళ్లు క్లీన్ చేయడం, కుక్ చేయడం వంటి పలు సంగతులను వీడియో రూపంలో ప్రేక్షకులతో షేర్ చేసుకుంటున్నారు.

తాజాగా నేచురల్ స్టార్ నాని తన కొడుకు జున్నుల మధ్య కరోనా గురించి ఆసక్తికరమైన చర్చ జరిగింది. కరోనా మహమ్మారి పిల్లలను ఎంతలా భయపెడుతుందో, దాని పట్ల పిల్లలకు ఎంత అవగాహన ఉందో జున్ను మాటలు వింటే అర్థమవుతోంది. తన కొడుకుతో కరోనా గురించి మాట్లాడుతున్న వీడియోను నాని ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నాడు.

నాని: జున్ను బయట ఎవరున్నారు?
జున్ను: కరోనా వైరస్..
నాని: ఇప్పుడు మనమేంచేయాలి?
జున్ను: ఇంట్లోనే ఉండాలి..
నాని: అప్పుడేం జరుగుతుంది?
జున్ను: కరోనా వైరస్.. గో..
నాని: గుడ్.. వెరీ గుడ్..
నాని అడిగిన ప్రశ్నలకు జున్ను ముద్దు ముద్దుగా జవాబులిచ్చిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.