Tamannaah Parents tested covid positive: స్టార్ హీరోయిన్ తమన్నా తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ అని వైద్య పరీక్షల్లో తేలింది. తల్లిదండ్రులకు స్వల్పంగా కరోనా లక్షణాలున్నట్లు అనిపించడంతో తమన్నా కుటుంబం, స్టాఫ్‌తో సహా కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నారు. తమన్నా తల్లిదండ్రులకు పాజిటివ్ రాగా.. మిగిలిన వారందరికీ నెగెటివ్ రిజల్ట్ వచ్చింది.
ఈ విషయాన్ని తమన్నా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశారు. మీ అందరి ప్రార్థనలు, ఆ దేవుడి దయ వల్ల తల్లిదండ్రులు త్వరగా కోలుకుంటారని భావిస్తున్నట్లు తమన్నా సదరు మెసేజ్‌లో పేర్కొన్నారు.
https://10tv.in/a-woman-spread-covid-to-27-customers-at-a-starbucks-its-mask-wearing-employees-escaped-infection/