రీల్ లైఫ్ లో విలన్లైనా రియల్ లైఫ్ లో మాత్రం హీరోయిజం చూపించి స్టార్ హీరోలవుతున్నారు. కొంతమందైతే దేవుళ్లని దండాలు కూడా పెడుతున్నారు. కష్టమొస్తే అయ్యో పాపం అనకుండా ఆ కష్టాన్ని ఎంత కష్టపడైనా తీరుస్తున్నారు ఈ విలన్లు. ఏ స్టార్ హీరో కూడా చెయ్యని సహాయం చేస్తూ.. నిజజీవితంలో తమ మంచి మనసుని చూపిస్తున్నారు ఈ తెరమీద విలన్లు. వేల కిలోమిటర్లు నడుతుస్న వలస కార్మికుల పాలిట హీరోలు గా మారుతున్నారు వెండితెర విలన్లు. ముఖ్యంగా ఫేమస్ విలన్ బొమ్మాళీ అంటూ భయపెట్టిన ‘సోనూసూద్’..
కష్టాల్లో ఉన్న వలస కార్మికుల పాలిట దేవుడయ్యాడు. ఈ మధ్య కేరళలో చిక్కుకున్నఒడిశాకు చెందిన 155 మంది మహిళా కార్మికుల కోసం ఏకంగా స్పెషల్ ప్లైట్ వేయించాడు. చిన్న పిల్లలు, లగేజ్ తో ఎండలో ఇబ్బంది పడుతూ నడుస్తున్న వలస జీవులను తన సొంత ఖర్చుతో బస్సులు ఏర్పాలు చేసి.. డబ్బులిచ్చి.. భోజనం పెట్టి మరీ వారి సొంత ఇళ్ళకు పంపుతున్నాడు సోనూసూద్.
అంతే కాదు లాక్ డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో ఒక రకంగా సేవ చేస్తూనే ఉన్నాడు సోనూ. పంజాబ్ డాక్టర్లకు 15 వందల PPE కిట్లు.. అందించాడు. ముంబయ్‌లోని తన హోటల్‌ను హెల్త్ కేర్ వర్కర్స్ ఉండడానికి ఉదారంగా ఇచ్చేశాడు.. అలాగే ఈ రంజాన్ మాసంలో భివాండీలో వేలాది మందికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. పిల్లలతో కష్టపడుతూ..ఎండలో సొంత ఊరికి బయలు దేరిన వారిలో చిట్టచివరి వ్యక్తి తన ఇంటికి చేరే వరకూ ఈ సర్వీస్ చేస్తూనే ఉంటానన్నాడు సోనూసూద్. డబ్బు కాదు మంచి మనసు ఉండాలి అని నిరూపించాడు. సోనూసూద్ ను దేశమంతా రియల్ హీరో అంటుందిప్పుడు.
మరోవైపు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా తన ఫౌండేషన్ ద్వారా వలస కూలీలను ఆదుకుంటున్నాడు. రీసెంట్ గా లాక్ డౌన్ వల్ల చిక్కుకుపోయిన 500 మంది వలస కార్మికులకు దాదాపు 40 రోజులు తన ఫామ్ హౌస్ లో ఆశ్రయం ఇచ్చాడు ప్రకాశ్ రాజ్. అన్ని వసతులు కల్పించి.. వారికి స్పెషల్ బస్సుల్లో రైల్వే స్టేషన్స్ కు పంపించాడు. సొంత ప్రాంతాలకు వెళ్ళడానికిసాయం చేశాడు. ఇంకా ఇలాంటి కార్యక్రమాలెన్నో చేస్తున్నాడు.
ఇక రీల్ లైఫ్ విలన్.. రవికిషన్ కూడా లాక్ డౌన్ తో ఇబ్బంది పడుతున్న పేదలను అనేక విధాలుగా ఆదుకుంటున్నాడు. వలస కార్మికులను సొంత ప్రాంతాలకు పంపించడంతో పాటు. ఆకలితో ఉన్న పేదలకు రేషన్ అందిస్తున్నాడు. ప్రభుత్వ సాయంతో పాటు తన సొంత ఖర్చులతో కార్మికులకు సాయం చేస్తున్నాడు రేసుగుర్రం విలన్. ఇలా సిల్వర్ స్క్రీన్ మీద విలనిజం పండించిన నటులు.. రియల్ లైఫ్ లో హీరోలు అనిపించుకుంటున్నారు.
Read: దటీజ్ సోనూసూద్ : భర్తతో కలిసిఉండలేనన్న మహిళ..ఇద్దరినీ గోవా పంపిస్తానన్న రియల్ హీరో