Crazy Gossip on Peddi Movie Glimpse
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మూవీ పెద్ది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. చరణ్ కెరీర్‌లో 16వ సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం కోసం మెగా అభిమానులు చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. అయితే ఈ సినిమా గ్లింప్స్ ని మేకర్స్ ఈ ఏప్రిల్ 6న శ్రీరామ నవమి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పెద్ది ఫస్ట్ షాట్ అంటూ వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా గ్లింప్స్ పై సాలిడ్ బజ్ ఇపుడు ఇండస్ట్రీలో బిగ్ సౌండ్ చేస్తోంది.
పెద్ది మూవీ గ్లింప్స్ మేకింగ్‌ను కంప్లీట్ చేశాడట డైరెక్టర్ బుచ్చిబాబు. పెద్ది గ్లింప్స్‌ను రామ్‌చరణ్ చూసి ఫుల్ ఖుషిగా ఫీలయ్యాడట. అందుకే ముందుగానే డైరెక్టర్ బుచ్చిబాబుకు శ్రీరామనవమి కానుక అందజేశాడట రామ్‌చరణ్. అయితే గ్లింప్స్ ఎలా రిలీజ్ చేయాలా అని మేకర్స్ థింక్ చేస్తున్నారట.
Buchibabu Sana : దర్శకుడు బుచ్చిబాబుకు రామ్‌చరణ్ దంపతుల గిఫ్ట్..
శ్రీరామ నవమి రోజు సోషల్ మీడియాలో రిలీజ్ చేద్దామా.. లేదా పెద్ద ఈవెంట్ అరెంజ్ చేసి ఫ్యాన్స్ మధ్య రిలీజ్ చేద్దామా అని ఆలోచిస్తున్నారంటా. ఒకవేళ ఈ ఈవెంట్‌కు చరణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే. ఏదైన ఇండోర్ ప్లేస్‌లో పెద్ది ఈవెంట్‌ని గ్రాండ్‌గా చేయాలనే డిసైడ్ అయ్యారట మేకర్స్. మొత్తానికి పెద్ది కోసం మెగా ఫ్యాన్స్ వెయ్యికళ్లతో వెయిట్ చేస్తున్నారు.
Sukumar : సుకుమార్ కామెంట్స్‌తో కోలీవుడ్ ఫుల్ హ్యాపీ..
శ్రీరామ నవమి రోజు రిలీజ్ అయ్యే పెద్ది మూవీ గ్లింప్స్ ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలు మించి ఉండబోతోంది అని తెలుస్తోంది. అంతే కాకుండా రామ్ చరణ్ డైలాగ్ మాడ్యులేషన్ మెయిన్ గా లాస్ట్ డైలాగ్ అదిరిపోతోంది అని టాక్.మొత్తానికి మాత్రం బుచ్చిబాబు సాలిడ్ కట్ ని తీసుకురాబోతున్నట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి ఈ అవైటెడ్ గ్లింప్స్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.