Sukumar : సుకుమార్ కామెంట్స్‌తో కోలీవుడ్ ఫుల్ హ్యాపీ..
డైరెక్టర్ సుకుమార్ చేసిన కామెంట్స్ కోలీవుడ్‌కి కిక్కు ఇస్తున్నాయట.

Director Sukumar Movie Plans With Surya and Karthi
పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ ఇమేజ్‌ను పాన్ ఇండియా లెవల్లో మోసుకెళ్లింది. ముఖ్యంగా పుష్ప-2కు వచ్చిన హైప్, ఆ సినిమా సాధించిన వసూళ్లు ఓ చరిత్ర. ఏకంగా 18వందల 71 కోట్లు కొల్లగొట్టింది. అయితే పుష్ప సిరీస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదని పుష్ప3 కూడా రాబోతుందని మూవీ మేకర్స్ హింట్ ఇచ్చారు.
ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతిలో అట్లీ, త్రివిక్రమ్ సినిమాలు ఉన్నాయి. వీటిని కంప్లీట్ చేసిన తరువాతనే పుష్ప-3 స్టార్ట్ చేస్తారనే ప్రచారం ఇండస్ట్రీలో బిగ్ సౌండ్ చేస్తోంది. ఈలోపు డైరెక్టర్ సుకుమార్ కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో ఓ సినిమా ప్లాన్ చేసుకున్నాడు. ఈ ప్రాజెక్ట్‌లు కంప్లీట్ అవ్వగానే పుష్ప-3ని సెట్‌మీదకు తీసుకెళ్తారట.
అయితే తాజాగా చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్‌లో డైరెక్టర్ సుకుమార్ చేసిన కామెంట్స్ కోలీవుడ్‌కి కిక్కు ఇస్తున్నాయట. పుష్ప లాంటి ఊర మాస్ సబ్జెక్ట్‌తో తమిళ్‌లో సినిమా చేస్తే ఎవరికి చేస్తారనే ప్రశ్న వేశారట కొందరు కోలీవుడ్ ప్రముఖులు. ఏమాత్రం ఆలోచించకుండా కార్తీతో చేయడానికి రెడీగా ఉన్నట్లు చెప్పేశారట సుకుమార్.
కార్తీ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ అంటే ఇష్టమంటూ కితాబు కూడా ఇచ్చేశాడట. అంతటితో ఆగకుండా సూర్య కూడా తన ఫేవరేట్ హీరో అంటూ చెప్పుకొచ్చారట సుకుమార్. సూర్య, కార్తీ తో కలిసి సినిమా చేసే ఛాన్స్ వస్తే అస్సలే వదలుకోనని సుకుమార్ చెప్పడంతో కోలీవుడ్ సినిమా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారట.
సుకుమార్ కామెంట్స్ విన్న తర్వాత సోషల్ మీడియాలో మరో కొత్త న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. పుష్ప-3లో కార్తీని విలన్‌గా సెలెక్ట్ చేసుకుంటారంటూ ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది. మొత్తానికి సుకుమార్.. తమిళ్ స్టార్స్‌ని కూడా డైరెక్ట్ చేసేందుకు రెడీగా ఉన్నాడంటూ తెగ ప్రచారం జరుగుతోంది. మరి కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.