Director : టీంఇండియా క్రికెటర్ అవ్వాల్సినవాడు.. కుళ్ళు రాజకీయాలు.. కట్ చేస్తే బాలీవుడ్ ని షేక్ చేసిన డైరెక్టర్..

ఇంతకీ అతను ఎవరు అనుకుంటున్నారా? (Director)

  • Published On : April 13, 2026 / 08:29 AM IST

Director

Director : ఒకప్పుడు క్రికెట్ బాగా ఆడి టీమ్ ఇండియాకి ఆడదాం అని కలలు కన్నాడు. కానీ క్రికెట్ లో జరిగిన రాజకీయాలతో అతనికి స్థానం దక్కలేదు. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అయి బాలీవుడ్ ని షేక్ చేస్తున్నాడు. ఇంతకీ అతను ఎవరు అనుకుంటున్నారా?

ఇటీవలే ధురంధర్ 2 సినిమాతో బాలీవుడ్ తో పాటు ఇండియన్ సినీ పరిశ్రమని షేక్ చేసి భారీ హిట్ కొట్టిన దర్శకుడు ఆదిత్య ధర్. వరుసగా ఉరి, ధురంధర్, ధురంధర్ 2 సినిమాలతో హిట్స్ కొడుతూ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆదిత్య ధర్ ఈ విషయం తెలిపాడు.

Also Read : Asha Bhosle : లతా మంగేష్కర్, ఆశా భోస్లే.. అక్కాచెల్లెళ్ల పుట్టుక, మరణం.. ఎన్ని యాదృచ్ఛికాలో..

ఆదిత్య ధర్ మాట్లాడుతూ.. నేను ఢిల్లీలో కాలేజీ చదివే రోజుల్లో క్రికెట్ బాగా ఆడేవాడ్ని. ఆఫ్ స్పిన్నర్ గా మంచి పేరు తెచ్చుకున్నాను. యూనివర్సిటీ లెవల్లో క్రికెట్ మ్యాచులు ఆడాను. టీమ్ ఇండియా క్రికెటర్ అవుతావు అన్నారు. నేను కూడా అదే అవ్వాలనుకున్నాను. 2001లో అండర్ 19 టీమ్ కి సెలెక్ట్ అవుతావు అని ముందు నుంచి సెలెక్టర్లు నాకు చెప్తూ వచ్చారు.

కానీ చివరి నిమిషంలో సెలెక్షన్ ప్రాసెస్ లో రాజకీయాలు జరిగాయని నా బదులు ఇంకొకరిని తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. దాంతో ఆ మాటలు వింటూనే ఏడ్చేసాను. ఆ తర్వాత మళ్ళీ క్రికెట్ వైపు వెళ్ళలేదు అని తెలిపాడు. అలా టీమ్ ఇండియాకు మంచి బౌలర్ అవ్వాల్సినవాడు ఇప్పుడు సినిమాలవైపు వచ్చి స్టార్ డైరెక్టర్ అయ్యాడు.

Also Read : Devara 2: ‘దేవర 2’లో మక్కల్ సెల్వన్.. తారక్‌తో తలపడనున్న విజయ్ సేతుపతి!