Daksha Trailer : మంచు లక్ష్మీ – మోహన్ బాబు మొదటిసారి కలిసి నటిస్తున్న సినిమా.. ట్రైలర్ రిలీజ్ చేసిన అల్లు అర్జున్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మంచు లక్ష్మి మోహన్ బాబు కలిసి నటించిన దక్ష సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసారు.(Daksha Trailer)

Daksha Trailer

Daksha Trailer : మంచు లక్ష్మీ, మోహన్ బాబు కలిసి మొదటిసారి ఓ సినిమా చేస్తున్నారు. శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై వంశీ కృష్ణ మల్లా నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా ‘దక్ష’. ది డెడ్‌లీ కాన్స్పిరసీ అనేది ట్యాగ్ లైన్. దక్ష సినిమా సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు ఈ సినిమా ట్రైలర్ ని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసారు.(Daksha Trailer)

దక్ష ట్రైలర్ ని తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. నా ఫ్రెండ్ లక్ష్మీ మంచుకి తన రాబోతున్న దక్ష సినిమాకు శుభాకాంక్షలు. మీరు, మోహన్ బాబు గారు కలిసి తెరపై కనిపించడం చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు అల్లు అర్జున్. మీరు కూడా దక్ష ట్రైలర్ చూసేయండి..

 

Also Read : A Master Piece : త్రేతాయుగానికి, ద్వాపర యుగానికి, కలియుగానికి లింక్ చేస్తూ ఈ సినిమా తీస్తున్నాం..

ట్రైలర్ రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ వంశీ కృష్ణ మల్లా మాట్లాడుతూ.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సార్‌కు థ్యాంక్స్. దుబాయ్‌లో జరిగిన సైమా వేడుకల్లో ట్రైలర్‌ను ప్రదర్శించగా అక్కడ అందరికీ నచ్చింది. మంచు లక్ష్మిగారు ఇప్పటి వరకు చేయని అద్భుతమైన పాత్రని చేశారు. మోహన్ బాబుగారిని, మంచు లక్ష్మిగారిని ఏకకాలంలో డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీ అని తెలిపారు.

 

Also See : Bhumika Chawla : అదే అందం.. అదే కొంటెతనం.. చీరకట్టులో భూమిక లేటెస్ట్ ఫొటోలు..