సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార జంటగా.. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘దర్బార్’. ఈ సినిమాలో సునీల్ శెట్టి, నివేదా ధామస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రజనీకాంత్ ను పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ మూవీలో ఆర్కిటెక్ట్ పాత్రలో కనిపించనున్నట్లు తెలిసింది.
తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాత ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇక అనిరుద్ సంగీత సారథ్యం వహించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ చెన్నైలో జరిగింది.
ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న దర్బార్ జనవరి 9న తెరపైకి రానుంది. సంక్రాంతి కానుకగా..తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.