ప్రభాస్‌తో పెట్.. పిక్ అదిరిందిగా!

  • Published By: sekhar ,Published On : November 10, 2020 / 05:27 PM IST
ప్రభాస్‌తో పెట్.. పిక్ అదిరిందిగా!

Updated On : November 10, 2020 / 5:44 PM IST

Prabhas with Alaskan Malamute: రెబల్ స్టార్ ప్రభాస్ Throwback పిక్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Alaskan Malamute జాతికి చెందిన పెట్‌తో డార్లింగ్ కలిసి ఉన్న ఫొటో అది. హీరోయిన్, ప్రొడ్యూసర్ ఛార్మి కౌర్‌కి చాలా ఇష్టమైన పెట్ ఇది. గతంలో తన పెట్‌తో కలిసిఉన్న పలు పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఛార్మి, అదంటే తనకెంతిష్టమో.. ఎందుకిష్టమో చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ‘నా 9 నెలల బేబితో డార్లింగ్’ అంటూ ఈ పిక్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది ఛార్మి.


రాజసం ఉట్టిపడేలా డార్లింగ్ సోఫాలో ఠీవీగా కూర్చోగా.. నేను నీ అభిమానినే అన్నట్టు ఫోజిచ్చింది ఛార్మి పెట్. ‘సింహంతో అలస్కాన్’ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ఫొటోకు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్ పలు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో చక్కర్లు కొడుతోంది.


అన్నట్టు అలస్కాకు చెందిన ఈ Alaskan Malamute జాతి శునకాల జీవితకాలం 10 నుండి 12 సంవత్సరాలు. బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ అండ్ రెడ్, గ్రే అండ్ వైట్, వైట్ అండ్ చాక్‌లెట్ పలు రంగుల్లో ఉండే Alaskan Malamute జాతికి చెందిన పెట్స్ చాలా మంది సెలబ్రిటీల ఇళ్లల్లో దర్శనిమిస్తుంటాయి.

https://10tv.in/ntr-and-prabhas-fans-waiting-for-updates/

 

View this post on Instagram

 

#Darling with my 9 months old baby boy ♥️ . . . @actorprabhas #alaskanmalamute @puriconnects

A post shared by Charmmekaur (@charmmekaur) on