Pushpa 2 : పుష్ప గెటప్‌ కోసం డేవిడ్ వార్నర్.. రూ.10,001 ఎవరకి పంపించాడు?

పేస్ యాప్ ద్వారా ఎడిట్ చేసి టాలీవుడ్ హీరోల గెటప్స్ లో దర్శనమిచ్చే క్రికెటర్ డేవిడ్ వార్నర్.. పుష్ప గెటప్‌ కోసం రూ.10,001 చెల్లించాడు. అయితే అది ఎవరికి..

Pushpa 2 : ఆస్ట్రేలియాన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) గురించి మన టాలీవుడ్ ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ (Allu Arjun) సాంగ్స్ అండ్ డైలాగ్స్ ని రీల్స్ అండ్ టిక్ టాక్ వీడియోలు చేస్తూ తెలుగు వారికి చాలా దగ్గరయ్యాడు. డేవిడ్ మాత్రమే కాదు అతని కుటుంబ సభ్యులు కూడా అల్లు అర్జున్ ని విపరీతంగా అభిమానిస్తుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు నాడు డేవిడ్ మరియు తన కూతురు ఇస్లా రోజ్ బన్నీకి బర్త్ డే విషెస్ చెబుతూ స్పెషల్ వీడియో పోస్ట్ చేశారు.

Pushpa 3: మూడో పార్ట్ రెడీ చేసుకున్న పుష్ప.. టైటిల్ కూడా ఫిక్స్.. నిజమేనా..?

తాజాగా డేవిడ్ వార్నర్ ఒక పోస్ట్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ కాళీమాత గెటప్ లో కనిపించిన విషయం తెలిసిందే. ఆ పోస్టర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఇక అల్లు అర్జున్ గెటప్స్ ని పేస్ యాప్ ద్వారా ఎడిట్ చేసి తన పేస్ తో ఉన్న పిక్స్ పోస్ట్ చేసి డేవిడ్.. ఈ చిత్రాన్ని కూడా ఎడిట్ చేసి పెట్టాడు. అయితే ఈ పోస్ట్ తో పాటు మరో పిక్ ని కూడా షేర్ చేశాడు. ఆ పోస్ట్ UPI లావాదేవికి సంబంధించిన పిక్. డేవిడ్ వార్నర్ ఎవరికో రూ.10,001 పంపించినట్లు దానిలో కనిపిస్తుంది. అయితే పేరుని మాత్రం డేవిడ్ కవర్ చేశాడు.

Pushpa : సినిమాలో అలా చూపించడం బాధాకరం.. పుష్ప సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన రిటైర్డ్ ఐజి..

ఈ పోస్ట్ కి కామెంట్ ఇలా రాసుకొచ్చాడు.. “మొదటిసారి UPIని ప్రయత్నించాను. నేను దీనిని ఎవరికి పంపాను అనేది కూడా మీరు ఊహించలేరు” అంటూ పోస్ట్ చేశాడు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజెన్లు వార్నర్ ఎవరికి పంపించి ఉంటాడు అని ఆలోచిస్తున్నారు. మరి ఆ మనీని వార్నర్ ఎవరికి పంపించాడు అనేది చెబుతాడా? లేదా సస్పెన్స్ గా ఉంచతాడా? అనేది చూడాలి.

ట్రెండింగ్ వార్తలు