Pushpa : సినిమాలో అలా చూపించడం బాధాకరం.. పుష్ప సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన రిటైర్డ్ ఐజి..

తాజాగా రిటైర్డ్ ఐజి కాంతారావు తిరుపతిలో 10 టివితో మాట్లాడుతూ పుష్ప సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Pushpa : సినిమాలో అలా చూపించడం బాధాకరం.. పుష్ప సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన రిటైర్డ్ ఐజి..

Retired IG Kantharao sensational Comments on Pushpa Movie

Pushpa :  అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇక్కడి కంటే కూడా పుష్ప బాలీవుడ్ లో భారీ హిట్ అయింది. ఇక సినిమాలోని పాటలు, డైలాగ్స్ ప్రపంచమంతటా పాపులర్ అయ్యాయి. పుష్ప సమయంలోనే పుష్ప పార్ట్ 2 కూడా ఉంటుందని ప్రకటించడంతో పార్ట్ 2 కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

ఇటీవలే కొన్ని రోజుల క్రితం పుష్ప పార్ట్ 2 షూటింగ్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. పార్ట్ 2 నుంచి ఓ గ్లింప్స్ వీడియో, ఓ పోస్టర్ రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు చిత్రయూనిట్. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప షూటింగ్ జరుగుతున్న ఈ సమయంలో పుష్ప నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్, ఇళ్లపై IT రైడ్స్ జరిగాయి. సుకుమార్ ఇంటిపై కూడా IT రైడ్స్ జరగడంతో టాలీవుడ్ లో కలకలం రేగింది. ఓ పక్కన ఇలా IT రైడ్స్ జరుగుతుంటే తాజాగా ఓ రిటైర్డ్ ఐజి పుష్ప సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Nidhhi Agerwal : పాపం నిధి అగర్వాల్.. పవన్ కళ్యాణ్ సినిమా నిధికి మైనస్ అవుతుందా?

తాజాగా రిటైర్డ్ ఐజి కాంతారావు తిరుపతిలో 10 టివితో మాట్లాడుతూ పుష్ప సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రిటైర్డ్ ఐజి కాంతారావు 10 టీవీతో మాట్లాడుతూ.. పుష్ప 1 చిత్రం కోసం సుకుమార్ అండ్ టీం మా నుంచి చాలా అంశాలు అడిగి తెలుసుకున్నారు. మేము వారికి చాలా సహకరించాము. సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హీరోగా చూపించడం, పోలీస్ అధికారులను లంచగొండిలుగా చూపించడం కొంత బాధాకరం. కనీసం రెండవ పార్ట్ లో అయినా పోలీసుల కష్టాలను సుకుమార్ చూపించాలి. స్మగ్లింగ్ ను అరికట్టడం కోసం కుటుంబాలను వదిలి మేము అడవుల్లో గడిపాము. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాము. వాటి గురించి సుకుమార్ చూపించాలని ఆశిస్తున్నాము. ఎర్రచందనం స్మగ్లింగ్ లో రాజకీయ నాయకుల ప్రమేయం ఊహాజనితం మాత్రమే. సుదీర్ఘకాలం టాస్క్ ఫోర్స్ చీఫ్ గా పని చేసిన తనకు ఏ రాజకీయ నాయకుడు ఫోన్ చేయలేదు అని అన్నారు. దీంతో ఈ రిటైర్డ్ ఐజి కాంతారావు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.