Pushpa 3: మూడో పార్ట్ రెడీ చేసుకున్న పుష్ప.. టైటిల్ కూడా ఫిక్స్.. నిజమేనా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ప్రస్తుతం పుష్ప-2 మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు మరో సీక్వెల్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది.

Pushpa 3: మూడో పార్ట్ రెడీ చేసుకున్న పుష్ప.. టైటిల్ కూడా ఫిక్స్.. నిజమేనా..?

Pushpa 3 To Have This Title

Pushpa 3: ఐకాన్ స్టార్ అల్లు అర్జన్ నటించిన ‘పుష్ప – ది రైజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప-2 మూవీని తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమాకు ‘పుష్ప-ది రూల్’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఇప్పటికే ఫిక్స్ చేసింది.

Pushpa : సినిమాలో అలా చూపించడం బాధాకరం.. పుష్ప సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన రిటైర్డ్ ఐజి..

అయితే, ఈ సినిమా కోసం ప్రేక్షకులతో పాటు సినీ వర్గాలు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నాయి. ఈ క్రమంలోనే పుష్ప-2 సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. కాగా, ఈ సినిమాకు మూడో భాగం కూడా ఉండబోతుందనే టాక్ ప్రస్తుతం నెట్టింట జోరుగా వినిపిస్తోంది. గతంలో పుష్ప మూవీ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ కూడా పుష్ప-3 ఉంటుందని తెలిపాడు. అయితే, దర్శకుడు సుకుమార్ ఇప్పటికే పుష్ప-3 కథను రెడీ చేశాడని.. ఈ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Pushpa : పుష్ప పార్ట్ 3 కూడా ఉంటుంది.. సుకుమార్ నాతో చెప్పాడు అంటున్న ఫహద్..

పుష్ప మూడో భాగానికి ‘పుష్ప-ది రూల్ బిగిన్స్’ అనే టైటిల్‌ను సుకుమార్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. పుష్ప-2 మూవీని అత్యంత భారీ బడ్జెట్‌తో చిత్ర యూనిట్ రూపొందిస్తుండగా, ఈ సినిమాలో బన్నీ మరోసారి అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోండగా, దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.