Pushpa : పుష్ప పార్ట్ 3 కూడా ఉంటుంది.. సుకుమార్ నాతో చెప్పాడు అంటున్న ఫహద్..

ఫహద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''పుష్ప టైంలో అల్లు అర్జున్, సుకుమార్ నన్ను బాగా చూసుకున్నారు. నేను పుష్ప పార్ట్ 2లో కూడా ఉంటాను. ఇది చాలా మంచి స్టోరీ. దీనికి పార్ట్ 3 కూడా ఉండబోతుంది. షూట్ టైంలో............

Pushpa : పుష్ప పార్ట్ 3 కూడా ఉంటుంది.. సుకుమార్ నాతో చెప్పాడు అంటున్న ఫహద్..

Pushpa 2

Pushpa :  అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా దేశవ్యాప్తంగా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. పుష్ప సినిమా పాటలు, డైలాగ్స్, స్టెప్పులు అన్ని వైరల్ గా మారాయి. ఈ సినిమాతో అల్లు అర్జున్, రష్మికకి దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. కలెక్షన్ల వర్షం కురిసింది పుష్ప సినిమాకి. ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషించాడు. పుష్పకి పార్ట్ 2 కూడా ఉంటుందని గతంలోనే ప్రకటించారు సుకుమార్.

ప్రస్తుతం సుకుమార్ పుష్ప పార్ట్ 2 కోసం వర్క్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుంది. పుష్ప 2తో మరింత భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు సుక్కూ. ఇప్పటికే పుష్ప భారీ హిట్ అవ్వడంతో పుష్ప 2 మీద అంచనాలు పెరిగిపోయాయి. పుష్పలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ పుష్ప 2లో కూడా ఉండనున్నాయి. వీటితో పాటు మరిన్ని క్యారెక్టర్స్ జత చేరనున్నాయని తెలుస్తుంది. సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లడానికి అన్ని భాషల యాక్టర్స్ ని సుకుమార్ తీసుకురానున్నాడట. తాజాగా ఫహద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుష్ప సినిమాకి పార్ట్ 3 కూడా ఉంటుందని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

Naga Chaitanya : ఫస్ట్ లవ్ గురించి చెప్పేసిన నాగచైతన్య.. సమంత కాదట..

ఫహద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”పుష్ప టైంలో అల్లు అర్జున్, సుకుమార్ నన్ను బాగా చూసుకున్నారు. నేను పుష్ప పార్ట్ 2లో కూడా ఉంటాను. ఇది చాలా మంచి స్టోరీ. దీనికి పార్ట్ 3 కూడా ఉండబోతుంది. షూట్ టైంలో సుకుమార్ నాతో చెప్పారు పుష్పకి పార్ట్ 3 కూడా చేయొచ్చని . ఈ స్టోరీకి పార్ట్ 3 తీసే స్కోప్ ఉంది. త్వరలోనే పార్ట్ 2 షూట్ మొదలవుతుంది” అని తెలిపారు. దీంతో ఇప్పటికే పుష్ప 2 కోసం ఎదురు చూస్తున్న అభిమానులు పార్ట్ 3 కూడా ఉంటుందని తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.