Naga Chaitanya : ఫస్ట్ లవ్ గురించి చెప్పేసిన నాగచైతన్య.. సమంత కాదట..

తాజాగా థాంక్యూ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ లవ్ గురించి తెలిపాడు. చైతన్య మాట్లాడుతూ.. ''నా ఫస్ట్‌లవ్‌ తొమ్మిదో తరగతిలో జరిగింది. నేను ఇంకో ఇద్దరు............

Naga Chaitanya : ఫస్ట్ లవ్ గురించి చెప్పేసిన నాగచైతన్య.. సమంత కాదట..

Naga Chaitanya :  నాగచైతన్య సమంతతో విడిపోయిన తర్వాత నుంచి కెరీర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ సాధించాడు. థాంక్యూ సినిమాతో మూడో హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు చైతూ. చైతూతో విడిపోయిన తర్వాత పెళ్లి, ప్రేమకి సంబంధించి రోజూ కొటేషన్స్ పెట్టింది సమంత. కానీ చైతన్య మాత్రం ఇప్పటివరకు ఆ టాపిక్స్ గురించి మాట్లాడలేదు. తాజాగా చైతన్య తన ఫస్ట్ లవ్ గురించి మాట్లాడాడు. చైతూ నటించిన థాంక్యూ సినిమా జులై 22న రిలీజ్ కాబోతుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు చైతన్య.

Mani Ratnam : దర్శకుడు మణిరత్నంకు కోవిడ్ పాజిటివ్.. హాస్పిటల్ లో చేరిక..

తాజాగా థాంక్యూ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ లవ్ గురించి తెలిపాడు. చైతన్య మాట్లాడుతూ.. ”నా ఫస్ట్‌లవ్‌ తొమ్మిదో తరగతిలో జరిగింది. నేను ఇంకో ఇద్దరు అబ్బాయిలు కలిసి ఒకే అమ్మాయిని ప్రేమించాము. కానీ ఆ అమ్మాయి మా ముగ్గురి లవ్ ని బ్రేక్ చేసి వెళ్ళిపోయింది. దీంతో లవ్ పోయినా ఆ తర్వాత మేము ముగ్గురం మంచి ఫ్రెండ్స్ అయ్యాము” అని తెలిపాడు. దీంతో సమంత చైతన్య ఫస్ట్ లవ్ కాదని తెలుస్తుంది. సమంతతో లవ్ గురించి మాత్రం మాట్లాడలేదు చైతూ. ఇప్పుడు చైతూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.