మే 9.. విజయ్ దేవరకొండ బర్త్‌డే సందర్భంగా, విజయ్ దేవరకొండకి బర్త్‌డే విషెస్ చెప్తూ, డియర్ కామ్రేడ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది మూవీ యూనిట్..
విజయ్ దేవరకొండ.. అతనో యూత్ ఐకాన్.. పోరీలంతా మస్త్‌గా లైక్ చేసే పోరడు.. యూత్ పోరగాళ్ళంతా దోస్త్‌లా ట్రీట్ చేసే చిల్ గయ్.. మై డియర్ రౌడీస్.. అంటూ ఫ్యాన్స్‌ని ముద్దుగా పిలిచే విజయ్.. సినిమా సినిమాకీ తన సక్సెస్ గ్రాఫ్‌ని, ఫ్యాన్ ఫాలోయింగ్‌ని పెంచుకుంటూ వెళ్తున్నాడు.. మే 9.. విజయ్ దేవరకొండ బర్త్‌డే..
రవిబాబు నువ్విలా, శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీస్‌లో చిన్న చిన్న క్యారెక్టర్స్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన విజయ్.. ఎవడే సుబ్రహ్మణ్యంలో నాని ఫ్రెండ్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.. సోలో హీరోగా పెళ్ళి చూపులు విజయ్ కెరీర్‌ని మార్చేస్తే, అర్జున్ రెడ్డి తనని స్టార్‌ని చేసింది. గీత గోవిందం, టాక్సీవాలా సినిమాలు విజయ్ స్టార్ డమ్‌ని రెట్టింపు చెయ్యడంతో పాటు, బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ఏంటో చూపించాయి. టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోగా విజయ్‌ని మార్చేసాయి.
ద్వారక, ఏం మంత్రం వేసావే, నోటా వంటి సినిమాలు అతని కెరీర్‌పై పెద్ద ఎఫెక్ట్ చూపించలేకపోయాయి. గీత గోవిందం, టాక్సీవాలా సినిమాలు రిలీజ్‌కి ముందే లీకైనా, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించాయి. మహానటిలోనూ విజయ్ నటనకు మంచి పేరొచ్చింది. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్‌లో డియర్ కామ్రేడ్ మూవీ చేస్తున్నాడు. విజయ్ దేవరకొండకి బర్త్‌డే విషెస్ చెప్తూ, డియర్ కామ్రేడ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది మూవీ యూనిట్..
జూలై 26న డియర్ కామ్రేడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అతను నటించబోయే మరికొన్ని సినిమాలు చర్చలో దశలో ఉన్నాయి. మరిన్ని మంచి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. పలువురు సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
వాచ్ డియర్ కామ్రేడ్ టీజర్..