Ilayaraja: ఇళయరాజాకు షాకిచ్చిన హైకోర్టు.. ఇక నుంచి కేసులు పెట్టడానికి లేదు
ఇళయరాజా(Ilayaraja) తన పాటలపై కాపీ రైట్ కేసులు వేయకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
- V Santhosh Kumar
- Published On : February 17, 2026 / 06:47 PM IST
Delhi High Court shocking verdict on Ilayaraja and Saregama company issue
Ilayaraja: ఇళయరాజా పేరు చెప్పగానే అద్భుతమైన పాటలు గుర్తొస్తాయి. కానీ, ఈమధ్య ఆయన పేరు చెప్తే కోర్టు కేసులు గుర్తుకు వస్స్తున్నాయి. దానికి కారణం, ఇటీవల ఆయన వేస్తున్న కేసులో. అనుమతి లేకుండా తన పాటలను వేరే సినిమాల్లో వాడటంపై ఆయన కేసులు వేస్తూ వస్తున్నారు. కాపీరైట్ పేరుతో ఆయన వేస్తున్న కేసుల్లో చాలావరకు ఆయనకు అనుకూలంగానే తీర్పులే వచ్చాయి.
IBomma Ravi: ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు.. జైలు నుంచి విడుదల
కానీ, తాజాగా ఢిల్లీ హైకోర్టు మాత్రం ఆయనకు షాకిచ్చింది. అసలు విషయం ఏంటంటే, ‘అగత్యా’ సినిమా విడుదల సమయంలో ఇళయరాజా(Ilayaraja), సరిగమ ఆడియో సంస్థ మధ్య వివాదం రాజుకుంది. ఆ వివాదం కాస్త కోర్టు వరకు వెళ్లింది. ఈ కేసులోనే ఢిల్లీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో తుది తీర్పు వెలువడేం తవరకు సరిగమ ఆడియో సంస్థకు చెందిన 134 సినిమాల్లో పాటలను ఇళయారాజా ఉపయోగించడానికి వీల్లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి, ఇకపై ఆ పాటలపై కాపీరైట్ లాంటివి వేయడానికి ఇళయరాజాకు అధికారం లేదని స్పష్టం చేసింది.
