Delhi Kumar : ఆ హీరో నా సొంత కొడుకే.. కానీ మా మధ్య ఆ బంధం లేదు.. అరవింద్ స్వామిపై సీనియర్ నటుడు సంచలన వ్యాఖ్యలు..
ప్రముఖ సీనియర్ నటుడు ఢిల్లీ కుమార్ అరవింద్ స్వామి నా సొంత కొడుకు అంటూ తాజా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
- Saketh U
- Published On : September 11, 2023 / 09:29 AM IST
Delhi Kumar sensational comments on Actor Arvind Swamy
Delhi Kumar : ఒకప్పుడు బాంబే, రోజా.. లాంటి సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించిన అరవింద్ స్వామి(Arvind Swamy) కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్ తీసుకొని తని ఒరువన్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ధృవ, తలైవి, కస్టడీ.. ఇలా వరుసగా సినిమాలు చేస్తున్నారు అరవింద్ స్వామి. అయితే అరవింద్ స్వామి ప్రముఖ బిజినెస్ మెన్ కూడా. సినిమాలకు గ్యాప్ తీసుకున్న సమయంలో తన బిజినెస్ ని బాగా విస్తరించారు. అరవింద్ స్వామి తండ్రి దివంగత తమిళ ప్రముఖ బిజినెస్ మెన్ వెంకటరామ దొరై స్వామి అని అందరికి తెలిసిందే.
అయితే ప్రముఖ సీనియర్ నటుడు ఢిల్లీ కుమార్ అరవింద్ స్వామి నా సొంత కొడుకు అంటూ తాజా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ కుమార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అరవింద్ స్వామి నా సొంత కొడుకు. కానీ మా మధ్య తండ్రి కొడుకుల బంధం లేదు. చిన్నప్పుడే అరవింద్ కి ఊహ తెలియకముందే అతన్ని నా చెల్లెలు వసంత స్వామికి దత్తత ఇచ్చేశాను. అప్పట్నుంచి అరవింద్ వాళ్ళ ఇంటి బిడ్డగానే పెరిగాడు. అరవింద్ కి అతని సొంత తండ్రి నేను అని తెలుసు కానీ మేము ఆ బంధాన్ని పెంచుకోలేదు. ఎప్పుడన్నా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి కలవడం తప్ప అతను నన్ను ప్రత్యేకంగా కలవడు అని తెలిపారు.
అలాగే.. మేమిద్దరమే ఒకరిగురించి ఒకరం కూడా ఇప్పటివరకు ఎక్కడా మాట్లాడుకోలేదు, ఇద్దరం కలిసి ఎప్పుడూ నటించలేదు. కానీ అవకాశం వస్తే అరవింద్ తో కలిసి నటించడానికి నేను రెడీ అని తెలిపారు ఢిల్లీ కుమార్. దీంతో ఢిల్లీ కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
అయితే అరవింద్ తన కెరీర్ ఆరంభంలో మొదటి సినిమా సమయంలోనే ఢిల్లీ కుమార్ తన సొంత నాన్న అని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ దీని గురించి అరవింద్ స్వామి మాట్లాడలేదు. దీంతో ఈ జనరేషన్ వాళ్ళకి చాలా మందికి ఈ విషయం తెలియదు. ఇన్నేళ్ల తర్వాత ఢిల్లీ కుమార్ ఈ విషయంపై పబ్లిక్ గా మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
