దేవ్ ప్రీ రిలీజ్ బిజినెస్

దేవ్ మూవీ లవర్స్ డే స్పెషల్‌గా ఫిబ్రవరి 14న తమిళ్, తెలుగులో రిలీజ్ అవబోతుంది.

  • Publish Date - January 31, 2019 / 09:47 AM IST

దేవ్ మూవీ లవర్స్ డే స్పెషల్‌గా ఫిబ్రవరి 14న తమిళ్, తెలుగులో రిలీజ్ అవబోతుంది.

కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ హీరో, హీరోయిన్స్‌గా, రజత్ రవిశంకర్ డైరెక్షన్‌లో, రిలయన్స్ ఎంటర్ టైన్‌‌మెంట్, ప్రిన్స్ పిక్చర్స్ అండ్ ఎస్.లక్ష్మణ్ కుమార్ తమిళ్‌లో నిర్మిస్తున్న సినిమా, దేవ్. తెలుగులో అదే పేరుతో ఠాగూర్ మధు రిలీజ్ చేస్తున్నాడు. ఇంతకుముందు రిలీజ్ చేసిన దేవ్ ఫస్ట్ లుక్, టీజర్‌అండ్ సాంగ్స్‌కీ మంచి రెస్పాన్స్ వస్తోంది. గతేడాది కార్తీ నటించిన చినబాబు సినిమా తెలుగులో రిలీజ్ అయ్యి, యావరేజ్‌గా ఆడింది. దేవ్ మూవీ లవర్స్ డే స్పెషల్‌గా ఫిబ్రవరి 14న తమిళ్, తెలుగులో రిలీజ్ అవబోతుంది.

ఈ సినిమాపై ఉన్న పాజిటివ్ బజ్ కారణంగా, తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్‌గా బిజినెస్ జరుపుకుంది. ఆంధ్రా, తెలంగాణాలో దాదాపు.. రూ.5.5 కోట్ల నుండి, రూ.6 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. తమిళనాట దేవ్ డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ని సన్ టీవీ సొంతం చేసుకుంది. ఈ సాయంత్రం (జనవరి 31) దేవ్ ట్రైలర్ రిలీజ్ కానుంది.

వాచ్ ఎటో వెళ్ళినావే సాంగ్…