దేవ్ థియేట్రికల్ ట్రైలర్

దేవ్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్.

  • Publish Date - January 31, 2019 / 12:38 PM IST

దేవ్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్.

చినబాబు తర్వాత తెలుగులో రిలీజవుతున్న కార్తీ సినిమా.. దేవ్… కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ హీరో, హీరోయిన్స్‌గా, రజత్ రవిశంకర్ డైరెక్షన్‌లో, ఎస్.లక్ష్మణ్ కుమార్ తమిళ్‌లో నిర్మిస్తున్న సినిమా, దేవ్. ఈ సినిమాని తెలుగులో ఠాగూర్ మధు రిలీజ్ చెయ్యబోతున్నాడు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన దేవ్ ఫస్ట్ లుక్, టీజర్‌ అండ్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. రీసెంట్‌గా దేవ్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.. బావా, ఏ పని చేసేటప్పుడు డబ్బు, పేరు కన్నా, మనసు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుందో అదేరా.. నువ్వు చెయ్యాల్సిన పని.. అంటూ కార్తీ వాయిస్ ఓవర్‌తో వచ్చే డైలాగ్‌తో దేవ్ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. శరీరాన్ని ధృడ పరచుకోడానికి ఎన్నో దార్లున్నాయి.. మనసుని ధృడ పరచాలంటే ఒంటరితనం వల్లే అవుతుంది అనే డైలాగ్ బాగుంది.

జాబ్ చేస్తున్న కార్తీ, రకుల్ ప్రీత్‌ని చూసి లవ్‌లో పడడం, ఆమెతో కలిసి తిరగడం, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్.. ఇలా సాగిపోతుంది దేవ్ ట్రైలర్.. హారిస్ జయరాజ్ బ్యాగ్రౌండ్ స్కోర్, వేల్ రాజ్ ఫోటోగ్రఫీ బాగున్నాయి.. ఫిబ్రవరి 14న తమిళ్, తెలుగులో దేవ్ రిలీజ్ కానుంది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, విఘ్నేష్, అమృత, కార్తీక్ ముత్తురామన్, నిక్కీ గల్రానీ, రేణుక, వంశీకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం : హారిస్ జయరాజ్, ఎడిటింగ్ : రూబెన్, కెమెరా : ఆర్ వేల్‌రాజ్.

వాచ్ ట్రైలర్…