Deva Katta : రెండు సినిమాలకు కలిపి ఒకటే సీక్వెల్ తీసుకు వస్తానంటున్న దర్శకుడు.. ప్రస్థానం, రిపబ్లిక్..
ప్రస్థానం, రిపబ్లిక్ సినిమాలకు కలిపి ఒకటే సీక్వెల్ తీసుకు వస్తానంటున్న దర్శకుడు. సినిమాటిక్ యూనివర్స్‌గా..
- gum 95921
- Published On : April 19, 2024 / 06:31 PM IST
Deva Katta said he would make combined sequel to Prassthanam Republic movies
Deva Katta : టాలీవుడ్ డైరెక్టర్ దేవ కట్టా తీసింది నాలుగే సినిమాలే అయినా.. ఆడియన్స్ లో మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. ‘వెన్నెల’ సినిమాతో ఆడియన్స్ ని నవ్వించిన దేవ కట్టా.. ఆటోనగర్ సూర్య, ప్రస్థానం, రిపబ్లిక్ సినిమాలతో ఆడియన్స్ ని ఆలోచించేలా చేశారు. సమాజంలో ఉండే సమస్యలను ఈ మూడు సినిమాల్లో తనదైన శైలిలో చూపించి ఆకట్టుకున్నారు. ప్రస్థానం, రిపబ్లిక్ సినిమాలకు ఆడియన్స్ లో ప్రత్యేక స్థానం ఉంది.
పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ రెండు సినిమాలు సమాజంలోని ఒక చేదు నిజాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించాయి. ఈ రెండు సినిమాలకు సీక్వెల్ వస్తే చూడాలని ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. ఇక ఆడియన్స్ లో ఈ ఆసక్తి గమనించిన దేవ కట్టా.. ఆ రెండు సినిమాలకు విడివిడిగా సీక్వెల్స్ కాకుండా, రెండిటికి కలిపి ఒకటే సీక్వెల్ తీసుకు వస్తానంటూ చెబుతున్నారు.
Also read : Prabhas : కెనడా థియేటర్స్‌లో ప్రభాస్ సినిమాతో యాడ్స్ వేసి.. కారు రిపేరింగ్ సంస్థ ప్రమోషన్స్..
రీసెంట్ గా ఈయన ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. ఈక్రమంలోనే ప్రస్థానం, రిపబ్లిక్ సీక్వెల్స్ గురించి మాట్లాడుతూ.. రెండిటికి కలిపి ఒకటే సీక్వెల్ ని తీసుకు వస్తానంటూ పేర్కొన్నారు. మరి ఈ సీక్వెల్ ని సినిమాటిక్ యూనివర్స్ గా చెబుతారా..? లేదా మెయిన్ పాయింట్ ని ప్రాజెక్ట్ చేస్తూ ఒక సీక్వెల్ గానే తీసుకు వస్తారా అనేది చూడాలి.
ఇక ఇదే ఇంటర్వ్యూలో తాను ఆటోనగర్ సూర్య సినిమా సమయంలో ఎదుర్కొన్న విషయం గురించి కూడా చెప్పుకొచ్చారు. ఆ మూవీ చేస్తున్న సమయంలో టెక్నికల్ టీం అంతా ఒకటి అయ్యిపోయి దేవ కట్టాని పక్కన పెట్టేశారట. దీంతో ఆయన ప్రొడక్షన్ హౌస్ నుంచి ఆటోనగర్ సూర్య రష్‌స్ ని దొంగతనంగా తీసుకెళ్లి ప్రస్థానం ఎడిటర్ తో చేయించుకున్నారట.
