Devagudi
Devagudi : పుష్యం ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా దేవగుడి. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె.. ముఖ్య పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా ఆంధ్రప్రదేశ్ విప్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మంత్రి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి గెస్టులుగా హాజరయ్యారు.
దేవగుడి గ్లింప్స్ లాంచ్ ఈవెంట్లో దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పిలిచిన వెంటనే ప్రజా సేవలో బిజీగా ఉండి కూడా ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, మంత్రి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా నాయకుల నిబద్ధతను ప్రేరణగా తీసుకొని ఎంతో జాగ్రత్తగా ఈ సినిమాని తెరకెక్కించాను అని అన్నారు.
మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా మా కడప మాండలికంలో ఉండటం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని మూవీ యూనిట్ కి ఆల్ ద బెస్ట్ తెలిపారు. విప్ ఆది నారాయణరెడ్డి మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా ఈ సినిమా దర్శకనిర్మాత రామకృష్ణారెడ్డి నాకు ఎంతో పరిచయం ఉన్న వ్యక్తి. మా ఊరు పేరుతో ఈ సినిమా టైటిల్ పెట్టి ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమాకు ఎన్నో బాధ్యతలు వహించి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న రామకృష్ణారెడ్డి గారికి ఈ సినిమా మంచి విజయం ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
Also Read : ED Raids : స్టార్ హీరోల ఇళ్లల్లో ఈడీ సోదాలు.. లగ్జరీ కార్లను అక్రమంగా దిగుమతి చేసుకున్నారని..?